Varun Tej – Lavanya Tripathi Engagement: మెగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగబాబు నివాసం లో బంధు మిత్రుల సమక్ష్యం లో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వస్తాడో లేదో అనే సందేహం చివరి నిమిషం వరకు ఉన్నింది,కానీ ఆయన కూడా తన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నిశ్చితార్ధ వేడుకకు విచ్చేశాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక పోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు కాసేపటి క్రితమే విడుదల చేసారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంటని చూసి మెగా అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి.
పెళ్లి ఎప్పుడు ఏమిటి అనేది ఇంకా అధికారికంగా తెలియదు. ఇకపోతే వీళ్లిద్దరి నిశ్చితార్థం గురించి అటు వరుణ్ తేజ్ కానీ, ఇటు లావణ్య త్రిపాఠి కానీ ఇప్పటి వరకు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టకపోవడం గమనార్హం. సాధ్యమైనంత వరకు వీళ్లిద్దరు గుట్టు చప్పుడు కాకుండానే చేసుకుందాం అనుకున్నట్టు ఉన్నారు. అందుకే మీడియా కి కూడా ఆహ్వానం లేదు, కానీ సోషల్ మీడియా ఉండడం తో వీళ్లకు సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చేసాయి.
మా మధ్య ఏమి లేదంటూ నిన్న మొన్నటి వరకు మీడియా లో చెప్పుకుంటూ తిరిగిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి, ఇలా ఒక్కసారిగా పెళ్లి చేసుకుంటుండడం నిజంగా అందరికీ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఈ వివాహ మహోత్సవం ఎంత గ్రాండ్ గా జరగబోతుందో చూడాలి.ఈ పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అని అంటున్నారు, గతం లో నిహారిక కొణిదెల పెళ్లి కూడా ఇలాగే జరిగింది.
Varun Tej engaged to Lavanya Tripathi today! pic.twitter.com/UGLDoMCZDt
— idlebrain.com (@idlebraindotcom) June 9, 2023