Kalalaku Rekkalu Scheme: ఏపీలో( Andhra Pradesh) సరికొత్త పథకం అమల్లోకి రానుంది. కూటమి ప్రభుత్వం విద్యార్థినుల భవిష్యత్తు కోసం సరికొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. ‘కలలకు రెక్కలు’ పేరుతో ఉన్నత విద్య చదివే విద్యార్థునులకు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కూడా తిరిగి ప్రారంభించనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కూడా ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విద్యకు సంబంధించి ఎటువంటి పథకాలను సైతం నిలిపి వేయకూడదని భావిస్తున్నారు. వాటిని నిరంతరాయంగా కొనసాగించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి లోకేష్ ఉన్నత విద్య చదివే విద్యార్థినుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు.
Also Read: సుజనాచౌదరికి తీవ్రగాయాలు.. హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
* ఎన్నికల హామీగా..
ఎన్నికలకు ముందు కలలకు రెక్కలు( kalalaku rakkalu scheme ) పథకం అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని కూడా చెప్పింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కలలకు రెక్కలు పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెంచాలని.. అధ్యాపకుల కొరతను తీర్చాలని సూచించారు మంత్రి. ఇకనుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
* విద్యాశాఖ పై సమీక్ష..
విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) సమీక్ష చేశారు. ఎన్నికల ముందు కూటమి కలలకు రెక్కలు పథకాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి విద్యార్థినులు రుణాలు తీసుకుంటే.. వాటికి ప్రభుత్వమే గ్యారెంటీగా నిలుస్తుంది. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో సన్మానించాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా శాఖలో బదిలీలు పూర్తి చేయాలని కూడా ఆదేశించారు.
* డీఎస్సీ నిర్వహణపై ఆదేశాలు..
డీఎస్సీ( DSC) పరీక్షపై కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి నారా లోకేష్. డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతో పాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి కాల్ సెంటర్లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలతో పాటు విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని కూడా ఆదేశించారు. మొత్తానికైతే పాఠశాల విద్యాశాఖ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నారా లోకేష్.
Also Read: కాంగ్రెస్‌లో అంతర్మథనం: దామోదర రాజనర్సింహ కు పరిస్థితి అర్థమైందా?