Hari Hara Veeramallu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఆదరించడానికి అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రేక్షకులందరిలో ఎనలేని గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూ సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ ని కేటాయించి సినిమా షూటింగ్ ను కూడా తొందర్లోనే పూర్తి చేయాలనే ఉద్దేశ్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. ఇక ఇప్పటికే ఈ సినిమా లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాని టేకాఫ్ చేశాడు. మొత్తానికైతే సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న జ్యోతి కృష్ణ (Jyothi Krishna) తొందరలోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టాలనే ఉద్దేశ్యంలో ఉన్నారట. అయితే ఈ సినిమా ఎప్పటికప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
ఇక రిలీజ్ డేట్ విషయంలో అయితే చాలా సార్లు రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పటి వరకు ఎక్కువసార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసిన సినిమాగా హరిహర వీరమల్లు సినిమా నిలిచింది. మరి కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని జులైలో గాని ఆగస్టులో గాని రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈసారైనా సరైన డేట్ కి రిలీజ్ చేస్తారా? లేదంటే మరోసారి ఈ సినిమా డేట్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే పర్లేదు గాని లేకపోతే నిర్మాత ఏ ఏం రత్నం కి భారీగా లాసెస్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!