Rajamouli and Mahesh Babu : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించడం విశేషం… వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ దర్శకుడు రాబోయే కాలంలో పెను ప్రభంజనాలను సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ నేపధ్యం లో వస్తుంది కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధిస్తే ఆయన ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకునే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి ఇకమీదట చేయబోతున్న సినిమా షూటింగ్ ను కూడా చాలా వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారట.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అయినా 2027 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుకి బెస్ట్ ఫ్రెండ్ గా ఒక క్యారెక్టర్ అయితే ఉందట.
మరి ఆ క్యారెక్టర్ లో ఒక స్టార్ హీరోని తీసుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ ను ఎవరు చేయబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక ఈ విషయంలో కొంతమంది హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికి వాళ్ళు ఎవరు ఈ సినిమాలో నటించడం లేదనే క్లారిటీ అయితే వచ్చింది.
మరి ఆ క్యారెక్టర్ కోసం ఇతర భాషల నుంచి కొంతమంది యంగ్ హీరోలను తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ క్యారెక్టర్ కి కూడా మంచి గుర్తింపైతే వస్తుందట. సినిమా మొదటినుంచి చివరి వరకు మహేష్ బాబు తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అలాగే ఎమోషన్స్ ని ఎలివేషన్స్ బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ కూడా అదే కావడం విశేషం.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!