spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh pre release event : 'ఉస్తాద్ భగత్ సింగ్ ' ప్రీ...

Ustaad Bhagat Singh pre release event : ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ ..? ఫ్యాన్స్ డిమాండ్ మామూలుగా లేదుగా!

కాసేపట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతుంది. ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన బజ్ ఏర్పడడానికి అవసరమయ్యే చివరి ప్రమోషనల్ ఈవెంట్ ఇదే. ఇప్పటి వరకు హైప్ రప్పించడానికి చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ కమర్షియల్ సినిమా అవ్వడం , పాత కాలం సినిమాలాగా అనిపించడం తో యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడలేదు. నిన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కాస్త మార్కెట్ లో బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. కానీ ఇది సరిపోదు, ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లాలంటే కచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే మార్గం . పవన్ కళ్యాణ్ గతం లో కూడా ఇలాంటి బజ్ లేని సినిమాలు చేసాడు.

కానీ చివరి నిమిషం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా హైప్ వేరే లెవెల్ కి చేరుకొని ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగేవి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే దారి. ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోతోంది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ తో పాటు మూవీ టీం మొత్తం పాల్గొనబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వీరాభిమాని, బండ్ల గణేష్ వస్తున్నాడా లేదా అనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి వచ్చి మాట్లాడితే అభిమానుల్లో వచ్చే ఊపే వేరు. వారం రోజుల వరకు సోషల్ మీడియా మొత్తం మోతమోగిపోతాది. అందుకే ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ ని ఈవెంట్ కి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, ఈ ఈవెంట్ కి ఒకవేళ బండ్ల గణేష్ సర్ప్రైజ్ఞ్ ఎంట్రీ ఇస్తే మాత్రం, మూవీ కి కావాల్సినంత బజ్ క్రియేట్ అయిపోతుందని అంటున్నారు. మరి ఆయన వస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని పంథాలో మొదలు పెట్టారు. అప్పుడే 2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను దాటేసినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రేపు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ బుకింగ్స్ అయితే ప్రస్తుతానికి చాలా వీక్ గా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదనే ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఆధారపడుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular