Damodar Raja Narasimha
Damodar Raja Narasimha: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహ, పార్టీలో జరుగుతున్న అంతర్గత సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లోపం, నాయకుల మధ్య విభేదాలు, బహిరంగ వివాదాలు పార్టీ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.
నారాయణఖేడ్ ఘటన..
దామోదర రాజనర్సింహ ఆందోళనకు ప్రధాన కారణం, నారాయణఖేడ్‌లో ఇటీవల జరిగిన సంఘటన. కాంగ్రెస్ నాయకులు బహిరంగ వేదికపై ఘర్షణకు దిగడం, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలోనూ వివాదాలు చోటు చేసుకోవడం ఆయనను తీవ్రంగా కలవరపెట్టింది. ఈ ఘటన పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు. ‘పార్టీ నాయకులు బహిరంగంగా కొట్టుకోవడం ఏమిటి? ఇలాంటి చర్యలు పార్టీని ఎలా కాపాడతాయి?‘ అని ఆయన ప్రశ్నించారు.
నాయకుల అసంతప్తి
నారాయణఖేడ్ ఘటనతో పాటు, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులపై వస్తున్న విమర్శలు కూడా దామోదర ఆవేదనకు కారణమని తెలుస్తోంది. కొందరు నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ నాయకత్వంపై తమ అసంతప్తిని వెల్లడిస్తున్నారు. ఇటువంటి చర్యలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని, శత్రు పక్షాలకు ఆయుధం అందిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ స్వేచ్ఛ బలమా, బలహీనతా?
కాంగ్రెస్ పార్టీ బలం దాని స్వేచ్ఛాయుత వాతావరణమని, అదే సమయంలో అది బలహీనతగా కూడా మారుతుందని దామోదర రాజనర్సింహ సూచించారు. ‘పార్టీలో అభిప్రాయ బేదాలు సహజం. ఒక నాయకుడికి మరో నాయకుడితో విభేదాలు ఉండవచ్చు. కానీ, బహిరంగంగా వివాదాలు సష్టించడం పార్టీకి నష్టం కలిగిస్తుంది,‘ అని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు బలమైన నాయకత్వం అవసరమని, నాయకులంతా ఒకే అజెండాతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఐక్యతకు పిలుపు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ఉదాహరణగా చూపుతూ, దామోదర రాజనర్సింహ నాయకులకు ఐక్యత పాఠం చెప్పారు. ‘వైఎస్సార్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా, పార్టీని ఒక తాటిపై నడిపించి, అధికారంలోకి తెచ్చారు. ఆయన స్ఫూర్తిని నీతి నాయకులు అనుసరించాలి,‘ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఈ రోజు అధికారంలో ఉండటం వెనుక ఎందరో నాయకులు, కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని, ఆ శ్రమను గౌరవించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆయన గుర్తు చేశారు.
ఏకతాటిపై నడవాలని సూచన
కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, వర్గాలు సహజమేనని, అయితే అవి పార్టీ నాశనానికి దారితీయకూడదని దామోదర హెచ్చరించారు. ‘పార్టీలో ఎంతో మంది కీలక నాయకులు ఉన్నారు. రాజకీయ విభేదాలు తప్పవు. కానీ, అందరూ ఐక్యంగా ఉంటూ, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంపై దష్టి పెట్టాలి,‘ అని ఆయన సూచించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు, ఇక్కడ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి, వారి కషే నాయకుల విజయానికి కీలకమని పేర్కొన్నారు.
టీ కాంగ్రెస్‌లో సవాళ్లు
తెలంగాణ కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ, అంతర్గత సవాళ్లు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. నాయకుల మధ్య వర్గాలు, అసంతప్తులు, సమన్వయ లోపం వంటి సమస్యలు పార్టీ బలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇటీవల సంగారెడ్డి డీసీసీ సమావేశంలో ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యత లేకపోవడంపై నాయకులు ఘర్షణకు దిగిన ఘటన కూడా ఈ సమస్యలను మరింత స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు పార్టీ నాయకులకు ఒక హెచ్చరికగా, ఐక్యతకు పిలుపుగా నిలుస్తాయి.
Also Read: సుజనాచౌదరికి తీవ్రగాయాలు.. హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Damodar raja narasimha congress introspection