KA Paul : ఏపీలో వైసిపి నాయకులు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని జైల్లో పెట్టారు. దీనిపై వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తుండగానే.. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు అది సస్పెన్స్ లో ఉంది. చివరికి ఆ చిక్కుముడి వీడిపోయింది. నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఇదే విషయంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. అంతేకాదు దీని వెనుక ఉన్న కీలక విషయాలను కేఏ పాల్ వెలుగులోకి తెచ్చారు.
Also Read : ఆర్.కృష్ణయ్య నిజంగా బిచ్చగాడేనా.. కేఏ పాల్ మాటల్లో ఇంత మీనింగ్ ఉందా?
జనసేన అవినీతి కుటుంబ పార్టీ
నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని కేఏ పాల్ తప్పు పట్టారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన అనేది అవినీతి కుటుంబ పార్టీ అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.” జనసేన స్థాపించినప్పుడు ఇది ప్రజల పార్టీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ వాస్తవంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నది వేరే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ అవినీతిపరుడని గతంలోనే నేను చెప్పాను. జన సైనికులు ఇప్పటికైనా జనసేన పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరుతున్నాను. ప్రజాశాంతి పార్టీ ని బలోపేతం చేయడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని.. ఏపీలో అధికారంలోకి రావచ్చని.. ఈ విషయాన్ని నేను గతంలోని చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను. ప్రజాశాంతి పార్టీకి మాత్రమే ఏపీలో అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జన సైనికులు గుర్తుంచుకోవాలని” కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సహజంగా ఒక వ్యక్తి పై విమర్శలు చేసే విషయంలో కేఏ పాల్ ఏ మాత్రం మొహమాటాన్ని ప్రదర్శించరు. వేరే మాటకు తావు లేకుండా ఉన్న విషయాన్ని మొత్తం చెప్పేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే తీరుగా మాట్లాడారు. జనసేన పార్టీని కుటుంబ పార్టీ అని.. నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలను తాకట్టు పెట్టారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలను తాకట్టు పెట్టడం ఏమిటి అనే ప్రశ్నను కేఏ పాల్ ఎదుట విలేకరులు ప్రస్తావించగా.. కేఏ పాల్ దానికి సమాధానం చెప్పకుండా దాటవేయడం విశేషం.
Also Read : నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!