Akkineni Akhil : అక్కినేని అభిమానులకు పీడకల లాంటి సినిమా అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన ‘ఏజెంట్'(Agent Movie) చిత్రం. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అప్పట్లో ఒక ప్రకటన వచ్చినప్పుడు, ఈ చిత్రానికి ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరో సినిమాకి ఎలాంటి హైప్ ఏర్పడుతుందో, అలాంటి హైప్ ఈ చిత్రానికి ఏర్పడింది. కానీ రిపీట్ గా వాయిదాలు పడుతూ రావడంతో, ఈ సినిమా మీదున్న హైప్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. హీరోకి డైరెక్టర్ కి మధ్య విబేధాలు ఏర్పడడం, సురేందర్ రెడ్డి సినిమా సగం కూడా పూర్తి కాకముందే వాకౌట్ అవ్వడం. మిగిలిన సగానికి ఈ చిత్రానికి రచయతగా వ్యవహరించిన వక్కంతం వంశీ(Vakkantham Vamsi) దర్శకత్వం వహించడం వంటి అంశాలు ఈ చిత్రం చాలా నెగటివ్ ప్రభావాన్ని చూపించింది. ఇవన్నీ బయటకి చెప్పలేదు కానీ, ఈ సినిమాకి సగానికి పైగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించలేదు అనేది వాస్తవం.
Also Read : మహేష్ కి విలన్ గా స్టార్ హీరో, అలా హింట్ ఇచ్చేశాడా? రాజమౌళి ఛాయిస్ అదుర్స్!
కనీసం పాటలు హిట్ అయినా, ట్రైలర్ హిట్ అయినా ఈ సినిమాపై అంచనాలు పెరిగేవి. కానీ అది కూడా జరగలేదు. పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు. ఓటీటీ కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేయలేదు. జరిగిన ఆ 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అనేక ప్రాంతాల్లో అడ్వాన్స్ బేసిస్ మీద జరిగింది. అలా నష్టాల్లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ రావడం తో, దారుణమైన ఓపెనింగ్స్ ని చూడాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్ ని ప్రకటించినప్పుడు కచ్చితంగా ఈ చిత్రం 20 కోట్ల రూపాయిల షేర్ ఓపెనింగ్ ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ క్లోజింగ్ లో కేవలం 7 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సోనీ లైవ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రం విడుదలైన నాలుగు వారాలకే సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ నిర్మాతకు, సోనీ లైవ్(Sony Liv) సంస్థకు మధ్య కొన్ని వ్యాపార లావాదేవీల కారణంగా ఇన్ని రోజులు ఓటీటీ లో ఈ సినిమా విడుదల కాలేదు. అక్కినేని అభిమానులు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలా రోజుల నుండి నిరీక్షిస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమాని ఈ నెల 14వ తారీఖున సోనీ లైవ్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే చేసారు. థియేటర్స్ లో విడుదలైన వెర్షన్ కి, ఓటీటీ లో విడుదల అవ్వబోయే వెర్షన్ కి చాలా తేడా ఉంటుందట. ఎడిటింగ్ లో తొలగించిన అనేక మంచి సన్నివేశాలు ఈ ఓటీటీ వెర్షన్ లో ఉండబోతాయట, చూడాలి మరి అవి ఏ మేరకు ఆకట్టుకుంటాయి అనేది.
Also Read : ‘దయచేసి ఇక నుండి నన్ను అలా పిలవొద్దు’ అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసిన నయనతార!