Nagababu: మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆయన విషయంలో చాలా రకాలుగా ప్రచారం నడిచింది. అయితే చివరకు ఎమ్మెల్సీ గానే ఆయనను ఎంపిక చేశారు. ఈనెల 20న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. అయితే కూటమికి ఏకపక్ష మెజారిటీ ఉండడంతో.. 5 ఎమ్మెల్సీ పదవులు కూడా కూటమికే దక్కనున్నాయి. అయితే ఇందులో మూడు టిడిపి, ఒకటి జనసేనకు, మరొకటి బిజెపికి కేటాయించనున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: వర్మ ప్రత్యర్థి జనసేనలోకి.. అలా షాక్ ఇచ్చిన పవన్!
* క్యాబినెట్ లోకి సైతం..
అయితే కొద్ది రోజుల కిందట నాగబాబును( Nagababu ) క్యాబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తర్వాత అనేక మార్పులు సంతరించుకున్నట్లు ప్రచారం జరిగింది. నాగబాబు మంత్రి కాదు రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం సాగింది. ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులుగా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి.. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు రాజ్యసభకు పంపిస్తారని కూడా కామెంట్స్ వినిపించాయి. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇస్తారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటన్నింటికి బ్రేక్ వేస్తూ ఈరోజు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖరారు చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు.
* కసరత్తు ప్రారంభం
5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి కూటమి( Alliance ) కసరత్తు ప్రారంభించింది. ఒక పదవి జనసేన తరఫున నాగబాబుకు కాయం అయింది. మిగతా నాలుగు పదవులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టిడిపికి కచ్చితంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. బిజెపి సైతం ఒక ఎమ్మెల్సీ పదవి ఆశిస్తోంది. బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టిడిపిలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. పదవి విరమణ చేసిన వారిలో యనమల రామకృష్ణుడు ప్రధానంగా ఆశిస్తున్నారు.
* వంగవీటి కి చాన్స్
మరోవైపు పిఠాపురం( pittapuram ) వర్మ తన త్యాగానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఎక్కువగా ఆశిస్తున్నారు. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే నాగబాబు కాపు కోటా కింద పదవి తీసుకోనున్నారు. దీంతో రాధాకృష్ణ విషయంలో ఇది కొంత ఇబ్బందికరం. అయితే కాపులకు ప్రాధాన్యం ఇస్తున్న వేళ రెండు పదవులు ఇచ్చిన పర్వాలేదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. పైగా వంగవీటి రాధాకృష్ణకు పవన్ కళ్యాణ్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో నాగబాబుతో పాటు రాధాకృష్ణ సైతం పదవి దక్కే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: ఎమ్మెల్సీగా నాగబాబుకు నో ఛాన్స్.. చంద్రబాబుతో తేల్చి చెప్పిన పవన్!