spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena MLA Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో జనసేన ఎమ్మెల్యే

Janasena MLA Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో జనసేన ఎమ్మెల్యే

Janasena MLA Money Laundering Case: జనసేనలో( janasena ) కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి నాయకత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే లైంగిక పరమైన ఆరోపణలు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వచ్చి పడ్డాయి. వాటి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆర్థికపరమైన వివాదాలు వచ్చి పడడం విశేషం. జనసేన కు చెందిన మహిళ ఎమ్మెల్యే లోకం కళ్యాణి మాధవి పై ఏకంగా భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్ళింది. దానిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది ఈసి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జనసేనకు కొత్త తలనొప్పి ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలి పార్టీకి తల వంపులు తెస్తుంటే.. ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లడంతో ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది.

* ఉద్యోగుల ఖాతాల్లో అదనపు నగదు..
విజయనగరం ( Vijayanagaram) జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు లోకం కళ్యాణి మాధవి. జనసేన తరపున పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. స్వతహాగా విద్యాసంస్థల అధినేతగా ఉండేవారు ఆమె. మిరాకిల్ విద్యాసంస్థలు నడుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు జనసేన తరఫున. కేవలం 12 వేల ఓట్లు మాత్రమే అప్పట్లో సొంతం చేసుకున్నారు. అయితే పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో సీటు దక్కించుకున్నారు జనసేన తరఫున. అయితే అప్పట్లో మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారు అన్నది ఆమెపై వచ్చిన అభియోగం. మిరాకిల్ విద్యాసంస్థల్లో ఓ 300 మంది ఉద్యోగులు పనిచేసేవారట. 2024 ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు గాను ఆమె సిబ్బంది ఖాతాల్లో జీతాల కంటే అదనంగా లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు వేశారన్నది అభియోగం. అప్పట్లో అదే మిరాకిల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారట. దీంతో ఈసీ సీరియస్ యాక్షన్ లోకి దిగింది. దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఆదేశాలు జారీచేసింది.

* కూటమిలో కుమ్ములాట..
అయితే నెల్లిమర్ల( nelli Marla ) నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటిది. ఈ నియోజకవర్గ నుంచి టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన వయోభారంతో బాధపడుతుండడంతో కర్రోతు బంగారు రాజుకు ఆ బాధ్యతలు కట్టబెట్టారు చంద్రబాబు. వైసిపి హయాంలో పార్టీ అభివృద్ధికి బంగారు రాజు కృషి చేశారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో మనస్థాపానికి గురయ్యారు. చంద్రబాబు సముదాయించడంతో మెత్తబడ్డారు. జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. అయితే లోకం కళ్యాణి ఎమ్మెల్యే అయిన తర్వాత బంగారు రాజుతో విభేదాలు పెట్టుకున్నారు. ఆయనకు చంద్రబాబు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చారు. అప్పటినుంచి ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇక్కడ కూటమికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మనీ లాండరింగ్ కేసులో చిక్కుకోవడం మాత్రం సంచలనంగా మారింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజం అయితే మాత్రం ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper