spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy Mavigan Proposal: జగన్ 'మావిగన్'.. కదిలిన వైసీపీ దండు

Jagan Mohan Reddy Mavigan Proposal: జగన్ ‘మావిగన్’.. కదిలిన వైసీపీ దండు

Jagan Mohan Reddy Mavigan Proposal: Jagan Mohan Reddy Mavigan Proposal: ఏపీకి( Andhra Pradesh) కొత్త రాజధాని ప్రతిపాదన చేశారు జగన్ మోహన్ రెడ్డి. మావిగన్ అనే ప్రతిపాదన ఆయనదే. అయితే ఆయన ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతున్నారు. అమరావతి కాదు భ్రమరావతి.. అక్కడ నిర్మాణాలు పూర్తి కావడం అసాధ్యం.. గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ వైసీపీ విష ప్రచారాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిలిపివేసింది. అయితే మూడు రాజధానులను పట్టాలెక్కించలేకపోయింది. ఇప్పుడు మావిగన్ అంటూ మూడు నగరాల పేర్లతో జగన్ మరో వాదనను తెర మీదకు తెచ్చారు. ఈ వాదనను సమర్థించేందుకు వైసిపి దండు మీడియా ముందుకు వస్తోంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రజనీ తదితరులు అయితే జగన్ మావిగన్ మాత్రమే ఏపీ భవిష్యత్తు సెలవిస్తున్నారు. మూడు రాజధానుల నుంచి మావిగన్ కు అలా షిఫ్ట్ అయ్యారు.

Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

* నేతల కొత్త లెక్కలు..
రాజమండ్రి ( Rajahmundry)మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మీడియా ముందుకు వచ్చి అమరావతి నిర్మాణానికి వెచ్చించే లక్షల కోట్ల వ్యయంలో.. కేవలం 10 వేల కోట్లు ఖర్చు చేస్తే మావిగన్ ఇట్టే అభివృద్ధి చెందుతుంది అంటూ అమరావతి నిర్మాణాలకు తమ వంతు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మావిగన్ పై ఈ స్థాయి అవగాహన ఉన్నవారు ఐదేళ్ల హయాంలో మూడు రాజధానులు అంటూ ఎందుకు కాలక్షేపం చేశారు అనే ప్రశ్న వస్తోంది. విశాఖను పాలనా రాజధానిగా ఎందుకు నిర్ణయించుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక నిర్మాణానికి పునాది వేసిన తర్వాత దాన్ని ఎలా అయినా పూర్తి చేయాలని చిత్తశుద్ధి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అమరావతి విషయంలో ఆ కనికరం చూపలేదు జగన్మోహన్ రెడ్డి.

* సీనియర్లు మౌనం..
అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై తీవ్ర ప్రతికూలత వస్తోంది. దీంతో వైసిపి సీనియర్లు దీనిని సమర్థించలేకపోతున్నారు. ఇప్పటివరకు మాట్లాడిన ధర్మాన, బొత్స లాంటి వారు సైతం సైడ్ అయ్యారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఇటువంటి సమయంలో మళ్లీ ఆ వివాదాస్పద టీం అంబటి రాంబాబు, వీరిని నాని లాంటి వారు వచ్చి సమర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ది ఒక అద్భుతమైన ఆలోచన అని చెబుతున్నారు. భవిష్యత్తులో మీరే ఒప్పుకుంటారు కదా అని మళ్లీ కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పటివరకు రాజధాని ఎపిసోడ్ నడుస్తుందని సంకేతాలు ఇస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular