Homeఆంధ్రప్రదేశ్‌Kadapa Zilla Parishad: జగన్ కడప కు మరోసారి "పసుపు" పూసారు.. 27 ఏళ్ళ తర్వాత...

Kadapa Zilla Parishad: జగన్ కడప కు మరోసారి “పసుపు” పూసారు.. 27 ఏళ్ళ తర్వాత వైఎస్ ఇలాఖాలో చంద్రబాబు అద్భుతం..

Kadapa Zilla Parishad: ఇది మామూలు చరిత్ర కాదు.. వైయస్సార్ కడపలో “దేశం” సరికొత్త ఘనతను సృష్టించింది. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లా పరిషత్ కుర్చీని 27 ఏళ్ల సుదీర్ఘ విరమణ తర్వాత టిడిపి సొంతం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో మొత్తం 39 జడ్పీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసే సమయానికి.. ఏకంగా 23 స్థానాలు టిడిపి ఖాతాలోకి వచ్చేసాయి.. దీంతో ఎన్నికలు జరగకముందే క్లియర్ మెజారిటీ […]

Kadapa Zilla Parishad: ఇది మామూలు చరిత్ర కాదు.. వైయస్సార్ కడపలో “దేశం” సరికొత్త ఘనతను సృష్టించింది. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లా పరిషత్ కుర్చీని 27 ఏళ్ల సుదీర్ఘ విరమణ తర్వాత టిడిపి సొంతం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో మొత్తం 39 జడ్పీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసే సమయానికి.. ఏకంగా 23 స్థానాలు టిడిపి ఖాతాలోకి వచ్చేసాయి.. దీంతో ఎన్నికలు జరగకముందే క్లియర్ మెజారిటీ టిడిపి కూటమి సొంతం చేసుకుంది.

ఈ మెజారిటీ ద్వారా కడప జడ్పీ సీటు టిడిపి ఖాతాలోకి వెళ్లిపోయింది. కడప జిల్లా పరిధిలో ఉన్న కమలాపురం సెగ్మెంట్ లో మొత్తంగా ఆరు స్థానాలను టిడిపి దక్కించుకుంది. అదికూడా యునానిమస్ గా.. ఇక జమ్మలమడుగులో 4.. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో మూడు.. మైదుకూరు ప్రాంతంలో మూడు.. బద్వేలు ప్రాంతంలో మూడు.. రాజంపేట ప్రాంతంలో రెండు.. ప్రొద్దుటూరు ప్రాంతంలో రెండు స్థానాలు టిడిపి సొంతమయ్యాయి. గతంలో నామినేషన్ కూడా వేసే పరిస్థితి ఉండేది కాదు. అత్యంత భయానకమైన పరిస్థితిలో అప్పట్లో ఉండేది.. మొత్తంగా 23 మండలాలలో ప్రత్యర్థులు తన నిలబడే అవకాశం కూడా లేకపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

ఫ్యాన్ పార్టీకి కడప పెట్టని కోట లాంటిది. అటువంటి ప్రాంతంలో ఈ స్థాయిలో దిగజారిపోవడం నిజంగా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. జగన్ షర్టు మడతపెట్టి.. 2.0.. చూసుకుందాం.. అని సవాళ్లు విసురుతున్నప్పటికీ.. కనీసం ఆ మండలాలలో టీడీపీకి పోటీ ఇవ్వడానికి అభ్యర్థులు ముందుకు రాలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సుదీర్ఘ కాలం తర్వాత కడపలో పసుపు రంగు జెండా గర్వం గా ఎగిరింది. టిడిపి.. జనసేన.. బిజెపి నాయకులు తీసుకుంటున్నారు. 1990 చివరి కాలంలో టిడిపి కడపలో జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. మళ్లీ దాదాపు ఇన్ని సంవత్సరాలు తర్వాత టిడిపికి ఆ అవకాశం లభించింది..” ఫ్యాన్ పార్టీ అధినేత సొంత చెల్లికి అన్యాయం చేశాడు.. నమ్ముకున్న వాళ్లను బయటికి పంపేశాడు. అటువంటి వ్యక్తి ఎవరికీ న్యాయం చేయలేడు. అది ఆయన చుట్టూ ఉన్న వాళ్లకు అర్థమైంది. అందువల్లే ఆయన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని” టిడిపి నేతలు విజయగర్వంతో చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో టీడీపీ గెలిచింది. ఆ మధ్య జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా కడపలోనే పసుపు రంగుజెండా రెపరెపలాడింది. మొత్తానికి గత పరాజయాలకు చరమగీతం పాడుతూ.. జగన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ టీడీపీ తిరుగులేని చరిష్మాను దక్కించుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper