IPS officer : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. ఒకవైపు సీనియర్ నేతల అరెస్టు పర్వం నడుస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా ముంబై నటి కదంబరి జెత్వాని కేసులో ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముంబై నటిని వేధించి కేసులు విత్ డ్రా చేయించారని.. ఆమె విషయంలో అమానుషంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టులు జరిగాయి. కొంతమంది పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఏపీ సిఐడి అధికారులు హైదరాబాదులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన అధికారిగా ఉండేవారు. ఈ క్రమంలోనే అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ముంబై నటి కేసులో అతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అవి రుజువు కావడంతోనే ఆయన అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరగగా.. ముంబై నటి కేసులో వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కీలక అధికారిగా ఉన్న వ్యక్తి అరెస్టు కావడం సంచలనం రేకెత్తిస్తోంది.
Also Read : ఏపీకి పోవాల్సిందే.. తెలంగాణలో తిష్టవేసిన ఐపీఎస్ లకు ఇది ఊహించని షాక్
* తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
ముంబైకి( Mumbai) చెందిన సినీనటి కాదంబరి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో కదంబరికి ప్రేమాయణం నడిచింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం సదరు పారిశ్రామికవేత్త కుటుంబానికి నచ్చలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పారిశ్రామికవేత్త కుమారుడితో కాదంబరి వివాహానికి పట్టుబడింది. వ్యతిరేకంగా ముంబైలో కేసు పెట్టింది. ఈ తరుణంలోనే ఆ పారిశ్రామికవేత్త అప్పటి వైసిపి ప్రభుత్వం పెద్దలను కలిశారట. అప్పుడే కదంబరికి వ్యతిరేకంగా భారీగా కుట్ర జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ భూమి వ్యవహారంలో తనను మోసగించిందని ఓవైసీపీ నేతతో ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పని చేసిన కీలక అధికారులతో పాటు పోలీస్ అధికారులు బలవంతంగా కాదంబరిని అరెస్టు చేశారు. ఆమెతో పాటు తల్లిదండ్రులను సైతం కస్టడీలో ఉంచి హింసించారు. చివరకు ముంబైలో కేసు విత్ డ్రా చేసుకునేందుకు కాదంబరి ముందుకు రావడంతో విడిచి పెట్టినట్లు బాధితురాలు చెబుతూ వస్తున్నారు.
* కూటమి రావడంతో కదలిక..
అయితే కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితురాలు నేరుగా ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. అయితే దీనికి సూత్రధారిగా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అని తేలింది. ఆయనపై సైతం కేసు నమోదు అయింది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణలు సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ కేసులను సిఐడి కి బదిలీ చేశారు. అలాగే ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల ముంబై నటి విజయవాడ వచ్చారు. తన కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే సిఐడి అధికారులు సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులను అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
* వరుస అరెస్టులతో ఆందోళన
అయితే ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మద్యం కుంభకోణం( liquor scome) కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం మూడుసార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు కసిరెడ్డి హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్ విమానాశ్రయంలో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు ముంబై నటి కేసులో ఏపీ సిఐడి అధికారులు మాజీ ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకోవడం సంచలనం గా మారింది. ఇలా వరుస అరెస్టులతో కూటమి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.
Also Read : ఫేక్ ఐపీఎస్ ఆయనే.. పవన్ పర్యటనలో ఎంటర్ అయ్యారు అలా!