Anil Kumar Yadav : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో చాలామంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇప్పటివరకు కనిపించడం లేదు. కనీసం ఆయన జాడలేదు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూడడం లేదు. అసలు అనిల్ కుమార్ యాదవ్ పార్టీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను పట్టించుకోవడం మానేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం కేసులకు భయపడి రాష్ట్రానికి దూరంగా అనిల్ కుమార్ యాదవ్ ఉండిపోయారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ?
* దూకుడు కలిగిన నేత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేతల్లో అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) ఒకరు. జగన్కు అండగా ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరు వేరు. 2014 నుంచి 2024 వరకు ఆయన దూకుడుగా ఉండేవారు. ఎప్పుడైతే ఓటమి ఎదురైందో నాటి నుంచి సైలెంట్ అయ్యారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే తన శాఖ ప్రగతి కంటే ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో ముందుండే వారు అనిల్ కుమార్ యాదవ్. అసెంబ్లీలో అయితే చంద్రబాబు లాంటి సీనియర్ నేతను సైతం చులకన చేసి మాట్లాడారు. నిత్యం వివాదాలు పెట్టుకునేవారు. సొంత పార్టీ నేతలతో సైతం ఆయన గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకే ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి నీరుగారిపోయింది. అందుకే రాష్ట్రానికి దూరంగా పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ కు ఎక్కడ బాధ్యతలు అప్పగించకుండా పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
* కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
2008లో కాంగ్రెస్ పార్టీ( Congress Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. కుటుంబ సభ్యులు గ్రామస్థాయి రాజకీయాలు చేసేవారు. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో నెల్లూరు సిటీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గం రెండుగా మారింది. ఈ తరుణంలో ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. 90 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2024 లో మాత్రం నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
* జగన్ ఆగ్రహం..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎంత దూకుడు తనం ప్రదర్శించారో… ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో అంతే సైలెంట్ అయ్యారు. కనీసం నియోజకవర్గ ముఖం కూడా చూడడం లేదు. సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ పై( Nellore City) దృష్టి పెట్టడం లేదు. అటు నరసరావుపేట పార్లమెంటు స్థానం వైపు వెళ్లడం లేదు. నెల్లూరు సిటీ బాధ్యతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇటీవల నెల్లూరు మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమాలపై విచారణ ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనికి భయపడి అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గానికి దూరంగా ఉండిపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినా.. అనిల్ కుమార్ యాదవ్ అలా వ్యవహరిస్తుండడం పై జగన్మోహన్ రెడ్డి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది.
Also Read : ఆ మాజీ మంత్రి సైలెంట్ వెనుక కారణమేంటి?