Pensions : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. వరుసగా సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో ఉంది. ఈనెల 26న మత్స్యకారులకు సంబంధించి వేట నిషేధ భృతి అందించనున్నారు. వచ్చే నెలలో కీలకమైన రెండు పథకాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్త పింఛన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు ఆరు లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల నేలకు 250 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను, దివ్యాంగుల భోగ సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించిన పింఛన్ల విషయంలో సర్వే పూర్తయింది. పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు ఉన్నాయని తేలిపోయింది. అందుకే వాటిని తొలగించి కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే పింఛన్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : ఏపీలో భారీగా బోగస్ పింఛన్లు.. ఆ నెల నుంచి కట్!
* లక్షలాది మంది ఎదురుచూపు..
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. చాలామంది అర్హులు పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే కొత్త పింఛన్లను జూలైలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం దీనిని గురించి సమావేశం నిర్వహించింది. అయితే ఈ వారంలో కొత్త పింఛన్ల అంశంపై మరోసారి కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. అటు తరువాత ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ కొత్త పింఛన్లు ఇవ్వాలనుకుంటే దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయితే ప్రభుత్వం జూలైలో దరఖాస్తులు స్వీకరించి.. ఆగస్టు నుంచి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
* గత కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు లేవు..
2024 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. ఎన్నికల సమయానికి దాదాపు 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే అప్పట్లో అర్హులను పక్కనపడేసి అనర్హులకు పెద్దపీటవేశారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగ పింఛన్ల కోసం భారీగా బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. సదరం సర్టిఫికెట్ కు 30 వేల రూపాయల వరకు వసూలు చేశారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ అనర్హులను తొలగించి.. కొత్త పింఛన్లు ఇస్తారన్నది తెలుస్తోంది.
* ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ..
అయితే పింఛన్ల( Pentions )పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తుంది. భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ ఒకటి నుంచి పౌచ్ పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. మేలు దరఖాస్తులు తీసుకొని జూన్ 1 నుంచి పింఛన్ అందిస్తారు. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. చాలామంది కొత్తవారు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఆగస్టు నుంచి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో వారి పింఛన్లు కట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!