IPS Officers: ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత.. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత.. సివిల్ సర్వెంట్ల పనితీరులో మార్పు వస్తోంది. నేతలకు సలాం కొట్టడం.. ఇష్టమైనచోట పోస్టింగ్ కోసం పైరవీలు చేయడం.. అడ్డగోలుగా సంపాదించడం.. దర్జాగా వెనుక వేసుకోవడం వంటి వాటిని కొంతమంది సివిల్ సర్వెంట్లు నిస్సిగ్గుగా చేస్తున్నారు. పాలకులు కూడా తాము చేసే అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు సివిల్ సర్వెంట్లను వాడుకుంటున్నారు. కోరుకున్నచోట సంవత్సరాలపాటు పనిచేయడానికి కొంతమంది సివిల్ సర్వెంట్లు తమకున్న అన్ని పరిచయాలను వాడుకుంటున్నారు. పెద్దపెద్ద నేతలను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కేంద్రం కొరడా ఝళిపించడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పడం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కేంద్రం చివరి వార్నింగ్ ఇచ్చేసింది. అది కూడా పూర్తి కావడంతో వారిపై తీవ్రస్థాయిలో స్వరం పెంచింది. ఒక్క క్షణం కూడా తెలంగాణలో ఉంటే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి ఏపీలో రిపోర్టు చేయక తప్పడం లేదు..
విభజన అనంతరం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కేంద్రం కొన్ని కమిటీలను నియమించింది. ఆ కమిటీలు సూచించిన అన్ని బంధనాల ప్రకారం సివిల్ సర్వెంట్లను విభజించారు. అయితే కొంతమంది అధికారులు దానిని వ్యతిరేకించి.. తమకు నచ్చిన రాష్ట్రంలో కొనసాగడానికి క్వాష్ పిటిషన్ ను కోర్టులలో దాఖలు చేశారు. ఇప్పటివరకు కొనసాగారు.. అయితే గత ఏడాది ఆ పిటిషన్లను క్యాట్(Central administration tribunal) కొట్టేసింది. అంతేకాదు కేటాయించిన రాష్ట్రాలలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేయండి. ఫలితంగా తెలంగాణలోని ఆమ్రపాలి వంటి ఐఏఎస్ లు ఆంధ్ర ప్రదేశ్ లో రిపోర్ట్ చేశారు. ఈ దశలో కొంతమంది ఐపీఎస్ ల సంబంధించి క్యాట్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో.. ముగ్గురు ఐపీఎస్ లు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారు తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లక తప్పదు. ఇలా ఆంధ్ర కి వెళ్తున్న ఐపీఎస్ అధికారులలో అంజనీ కుమార్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలంలో డీజీపీగా పని చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేశారు. అప్పట్లో డేటా చోరీ అంటూ వైసిపి ఫిర్యాదు చేస్తే.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. నాడు భారత రాష్ట్ర సమితి పెద్దలు చెప్పిన విధంగా తల ఊపారు. ఎవరికీ డిజిపి పోస్ట్ సంపాదించారు. అయితే ఫలితాలు వస్తున్న సమయంలోనే ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. నేరుగా రేవంత్ రెడ్డిని అభినందించడానికి వెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం అతనిపై బదిలీ వేటు వేసింది. ఇప్పుడు అంజనీ కుమార్ ఏపీకి వెళ్తున్నారు. వివేక హత్య జరిగినప్పుడు అభిషేక్ మహంతి కడపలో పనిచేశారు. కొద్దిరోజుల తర్వాత తెలంగాణకు బదిలీపై వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఏపీకి వెళ్తున్నారు. అయితే ఈ ముగ్గురు అధికారులు తెలంగాణలో ఉండడానికి.. తెలంగాణలో పని చేయడానికి చివరి వరకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు సఫలికృతం కాకపోవడంతో ఇప్పుడు ఏపీకి వస్తున్నారు.