Humanity is lacking in AP: ఏపీలో( Andhra Pradesh) కొన్ని ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమాజంలో మనిషన్నవాడు మాయమవుతున్నాడని అర్థం వచ్చేలా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో.. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఓ ఘటన ఆవేదనకు గురిచేసింది. భూ వివాదంలో గ్రామస్తులు వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి దాడి చేయడం బాధాకరం. సోషల్ మీడియాలో వెలుగు చూసింది ఈ ఘటన. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కర్ల గట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ttps://x.com/TeluguScribe/
భూ వివాదం నేపథ్యంలో..
గత కొద్దిరోజులుగా ఆ గ్రామంలో భూ వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని విద్యుత్ స్తంభానికి తాళ్ళతో కట్టేశారు. ఆమెపై దుర్భాషలాడుతూ ఆవేశం వ్యక్తం చేస్తూ చిత్రవధకు గురి చేశారు. తనకు ఎవరూ లేరని.. ఇలా స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెడతారా అంటూ సదరు బాధిత వృద్ధురాలు కన్నీటి పర్యాంతం అయింది. ఎవరో ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Also Read: ఇక తిరుపతికి వెళ్లాలంటే సెలవులు అవసరం లేదు.. ఎందుకో తెలుసా?
వరుసగా ఘటనలు..
అయితే వరుసగా కుప్పం( Kuppam ) నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్న ఆ మధ్యన భర్త అప్పు తీసుకున్న పాపానికి భార్యను తాళ్ళతో కట్టారు. తల్లిని అలా చేయడంతో అక్కడే ఉన్న పసివాడు కుక్క పెట్టి ఏడ్చాడు. అయినా సరే వారు విడిచిపెట్టలేదు. దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిందితులను అరెస్టు చేయడంతో పాటు బాధితురాలకు సాయం అందించింది. అటు తరువాత కుప్పం నియోజకవర్గంలో విద్యార్థులతో పాఠశాలలో పారిశుధ్యం పనులు చేయిస్తున్నారని మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు తాజాగా ఈ వృద్ధురాలిని కట్టేయడం కూడా వైరల్ అంశంగా మారింది.