Tirupati travel update: తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది తిరుపతికి వెళ్లాలని అనుకుంటుంటారు. కొందరు ఏడాదికి పలుసార్లు తిరుపతి ప్రయాణం చేస్తుంటారు. సుదూరం నుంచి తిరుపతికి వెళ్లాలని అనుకునేవారు రైళ్లలో ప్రయాణం చేస్తారు. మిగతా వాహనాలను కంటే ట్రైన్లో జర్నీ ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ ప్రదేశాల నుంచి తిరుపతికి అనేక ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది ఈ రవాణా మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఇప్పటికే ఎన్నో రకాల రైళ్లు ఉన్నా.. మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వీకెండ్ డేస్ లో ఈ రైలు ప్రయాణం చేయనున్నాయి. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు ప్రత్యేకంగా సెలవులు ఏర్పాటు చేసుకోకుండానే తిరుపతి ప్రయాణం చేయవచ్చు. మరి ఆ రైళ్ల వివరాలు ఏంటో తెలుసుకుందాం..
Also Read: ఆ రెండు కులాలకు కాదని.. బెజవాడ ఎమ్మెల్యేగా కోటా శ్రీనివాసరావు ను ఎందుకు చేశారు?!
చాలామందికి తిరుపతికి వెళ్లాలని కోరిక ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సెలవులు ఉన్న రోజుల్లో తిరుపతికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల నుంచి ట్రైన్స్ అందుబాటులో లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కొత్తగా కేవలం వీకెండేస్ లో ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్ర, శనివారాల్లో మాత్రమే ఈ ట్రైన్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ రైళ్ల వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా తాము ప్రత్యేకంగా సెలవులు పెట్టు కోవాల్సిన అవసరం లేదు.
తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించిన ప్రకారం…. హైదరాబాదు నుంచి ప్రతి శుక్ర శనివారాల్లో తిరుపతికి రైలు ప్రయాణం చేయనుంది. ఈరోజుల్లో 07017 అనే ట్రైన్ నగరంలోని చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రయాణం చేస్తుంది. అలాగే ప్రతి సోమ శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లి కి తిరిగి వస్తాయి. ఈ రైళ్లు పలుచోట్ల హాల్టింగు కూడా ఉన్నాయి. హైదరాబాదులోని చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్లే ట్రైన్ మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్లో ఆగుతోందని.. అక్కడి ప్రయాణికులు లేదా ఈ ప్రదేశాల్లో నుంచి ఈ రైలులో ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: రిస్కీ స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మాస్టర్..వణుకుపుట్టిస్తున్న వీడియో!
ఇవే కాకుండా బుధవారం కూడా చర్లపల్లి నుంచి తిరుపతికి 07251 రైలు వెళుతుందని అన్నారు. ఇప్పటికే పద్మావతి ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, వందే భారత్ వంటి రైళ్లు తిరుపతికి ప్రయాణం చేస్తుండగా.. అదనంగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రైన్స్ తో వీకెండ్ లో తిరుపతికి వెళ్లి తిరిగి రావచ్చని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అంతేకాకుండా మిగతా ట్రైన్స్ కంటే ఇందులో సులభంగా ప్రయాణం చేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. కొందరికి సమయం అనుకూలంగా లేనివారు ఇలాంటి ట్రైన్స్ లో తిరుపతికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.