spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Volunteers: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.45 వేలు ప్రకటించిన జగన్

AP Volunteers: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.45 వేలు ప్రకటించిన జగన్

AP Volunteers: తన మానస పుత్రికగా ఉన్న వాలంటీర్లకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. నగదు పురస్కారాలు కూడా అందిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డుల ప్రదానం కొనసాగింది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం పేరిట ఆత్మీయంగా సత్కరించనున్నారు. గురువారం గుంటూరు జిల్లాలో సీఎం జగన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. అటు తర్వాత వారం రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేరిట అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది నగదు పారితోషికాన్ని భారీగా పెంచారు. సేవ వజ్ర కింద ఇప్పటివరకు 30 వేల రూపాయల నగదు పురస్కారం అందిస్తుండగా.. ఈ మొత్తాన్ని 45 వేలకు పెంచారు. సేవారత్న అవార్డుకు ఇచ్చే సాయాన్ని 20వేల నుంచి 30 వేలకు పెంచారు. సేవా మిత్ర నిలిచిన వాలంటీర్లకు ఇచ్చే మొత్తాన్ని పదివేల నుంచి 15 వేలకు పెంచారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర కింద ఎంపిక చేసి ఒక్కొక్కరికి 45 వేల నగదు పురస్కారంతో పాటు సత్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ప్రతి మండలం లేదా మున్సిపాలిటీలో అత్యుత్తమంగా పనిచేసిన మొదటి ఐదుగురు వలంటీర్లకు 30 వేల చొప్పున నగదు బహుమతితో పాటు సన్మానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4150 మంది వాలంటీర్లకు సేవా రత్న పురస్కారాలు అందిస్తారు. సేవా మిత్ర కింద ఏడాది పాటు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన 2,50, 439 మంది వాలంటీర్లకు 15 వేల నగదు తో పాటు సత్కరించనున్నారు.

వాలంటీర్ల వందనం కార్యక్రమానికి గాను జగన్ సర్కార్ రూ.392.05 కోట్లు ఖర్చు పెడుతుండడం గమనార్హం. వీరితోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరికొందరు వాలంటీర్ల సేవలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 997 మంది వాలంటీర్లకు కన్సోలేషన్ కింద బహుమతులు అందించనున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నగదు బహుమతులు అందించనున్నారు. ఎందుకుగాను 1.61 కోట్ల నగదు బహుమతులు అందిస్తారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట సీఎం జగన్ వాలంటీర్లకు భారీ తాయిలాలు ప్రకటించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper
Exit mobile version