Farmers Chalo Delhi: కనీసం మద్దతు ధర (ఎంఎస్పీకి) చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రావడంతో అక్కడ ఉధృత వాతావరణ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు దూసుకు రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రైతులపై పోలీసులు సోనిక్ ఆయుధాలు ప్రయోగిస్తున్నారు.. అంటే ఇవి ఒకే దిశలో కర్ణభేరి పగిలేలా శబ్దాలు విడుదల చేస్తాయి. వీటిని లాంగ్ రేంజ్ ఆకుస్టిక్ డివైస్ (ఎల్ఆర్ఏడీ) గా పిలుస్తారు. ఇటువంటి వాటిని సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇటీవల కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వినియోగిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 2000 సంవత్సరం నుంచి సోనిక్ ఆయుధాలను ఉపయోగిస్తున్నారు.. ఇక 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేశారు. నాలుగేళ్ల క్రితం రైతులు చలో ఢిల్లీ పేరుతో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పోలీసులు ఎన్ని రకాలుగా భద్రత కల్పించినప్పటికీ రైతులు.. ఎర్రకోటపై తమ జెండా ఎగరేశారు.
గత మంగళవారం నుంచి రైతులు మళ్లీ చలో ఢిల్లీ చేపడుతున్నారు. రాజధాని అత్యంత సున్నిత ప్రాంతం కావడంతో వారిని శివారు ప్రాంతంలోనే కట్టడి చేయాలని ఉద్దేశంతో పోలీసులు ఎక్కడికికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఎల్ఆర్డీ విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటివల్ల చెవుల కర్ణభేరీలు పలిగిపోయేంత శబ్దం వినబడుతుంది. సాధారణంగా మన చెవులకు 90 డెసిబుల్స్ వరకు శబ్దాలను వినే సామర్ధ్యం ఉంటుంది. ఆ శబ్దం అంతకుమించితే చెవులలో కర్ణభేరి ల పై ప్రభావం పడుతుంది.. ఢిల్లీ పోలీసులు ఉపయోగిస్తున్న ఎల్ ఆర్ డీ లు 160 డెసిబుల్స్ వరకు శబ్దాలను విడుదల చేస్తాయి. సాధారణంగా ఇవి ఒకే దిశలో శబ్దాలను పంపడం వల్ల చెవులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఐదు నుంచి 60 డిగ్రీల వ్యాసార్థం లో భిన్న రీతుల్లో శబ్దాలను పంపడం వల్ల అవి కర్ణభేరిపై తీవ్ర ప్రభావాన్ని చెపుతాయి. ఎల్ఆర్డీఈఏ సామర్థ్యం 2 కిలో హెర్జ్ ల వరకు ఉంటుంది. ఒకే పౌన: పున్యం తో 2.4 కి.మీ దూరం వరకు ఎల్ఆర్డీఈఏ లు భారీ శబ్దాలు పంపుతాయి.
ఇక రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు డ్రోన్ లతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. ఫలితంగా రైతులు గాయపడ్డారు. పోలీసుల చర్యకు విరుగుడుగా రైతులు పతంగులు ఎగరవేశారు. ఆ పతంగుల దారాలకు చిక్కుకుపోయి డ్రోన్లు కొన్ని కుప్పకూలిపోయాయి. ఇక భాశ్లవైపు ప్రభావాన్ని తగ్గించేందుకు రైతులు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ బాటిళ్ళు, కాటన్ దుస్తులు దగ్గర పెట్టుకున్నారు. కాగా పోలీసుల రబ్బర్ బుల్లెట్ల కాల్పుల్లో 40 మంది రైతులు గాయపడ్డారు.
పంజాబ్_ హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద, ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లోని సింఘ్వాలా, ఖనౌరీ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఆ ప్రాంతంలో సుమారు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో లక్షల మందికి పైగా రైతులు రెడీగా ఉన్నారు. వారంతా ఢిల్లీకి రాకుండా ఉండేందుకు హర్యానా పోలీసులు బార్కెట్లు ఏర్పాటు చేశారు. గతంలో రైతులు ఈ బారికేడ్లను తప్పించేందుకు ట్రాక్టర్లు ఉపయోగించారు. అయితే రైతులు ముందుకు దూసుకు రాకుండా ఉండేందుకు.. వారి ట్రాక్టర్ల టైర్లు పంచర్ అయ్యేందుకు రోడ్లపై మేకులు, ఇనుప కంచెలను పోలీసులు ఏర్పాటు చేశారు. రైతులు జారిపడే విధంగా, వాహనాలు అదుపుతప్పే విధంగా రోడ్లపై లూబ్రికెంట్స్ వాడారు. కాగా రైతు సంఘం నేతలతో బుధవారం కేంద్రం చర్చలు జరిపింది. కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం లేదు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా రైతుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.