spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: షూటింగ్ లు బంద్.. బాలయ్య అసలు ప్లాన్ ఏంటి?

Balakrishna: షూటింగ్ లు బంద్.. బాలయ్య అసలు ప్లాన్ ఏంటి?

Balakrishna: బాలయ్య బాబు అంటే మినిమమ్ ఉంటుంది. ఈయన నటించే సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బాలయ్య సినిమా థియేటర్ లో వచ్చిందంటే చాలు విజిల్స్, పేపర్స్ తో హాల్ మొత్తం నిండిపోతుంది. అయితే ఈయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కింగే.. ఓటమి ఎరగడం కష్టమే అంటారు ఈయన అభిమానులు. అయితే ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు బాలయ్య. ఇంతకీ ఓసారి ఆ సినిమా ఏమైందో తెలుసుకుందామా?

ఈ నెలాఖరు తర్వాత బాలకృష్ణ కొంతకాలం పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇస్తారట. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండడంతో పొలిటికల్ కార్యక్రమాలతో బాలయ్య బిజీ కానున్నట్టు సమాచారం. ఆ సమయంలో బాలయ్య కాంబినేషన్ లేని సీన్లను షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ సంవత్సరం దసరా రేసులో నిలుస్తుందట ఈ సినిమా. గతేడాది దసరాకు భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ఈ సంవత్సరం అంతకు మించి హిట్ అందుకోవడానికి సిద్దమయ్యారనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతోందని సమాచారం. ఇక బాలయ్య వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో సితార నిర్మాతలు ఈ సినిమా విషయంలో రాజీ పడడం లేదు. ఈయన మాస్ సినిమాల్లో నటిస్తే భారీ విజయాలు సొంతం అవుతాయనే టాక్ ఉండడంతో బాబీ సినిమా కూడా అదే తరహాలో రానుందట. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో హిందూపురంతో పాటు ఏపీలోని ప్రముఖ జిల్లాలలో పర్యటించనున్నారని టాక్.

బాలయ్య సినిమాల్లో ఏ విధంగా సక్సెస్ సాధిస్తున్నారో.. ఈ సారి కూడా పొలిటికల్ గా కూడా అదే రేంజ్ లో సక్సెస్ ను సాధించాలి అనుకుంటున్నారు అభిమానులు. రూ. 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య టీవీ యాడ్స్, ఓటీటీ షోల ద్వారా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. సీనియర్ హీరోలలో టాప్ రేంజ్ లో స్థానం సంపాదించి తన సత్తా చాటుతున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version