spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Garikapati Narasimha Rao: పిల్లల అన్నంపై ఏడుపెందుకు గరికపాటి’‘.. ఇదేనా మీ పెద్దరికం!

Garikapati Narasimha Rao: పిల్లల అన్నంపై ఏడుపెందుకు గరికపాటి’‘.. ఇదేనా మీ పెద్దరికం!

Garikapati Narasimha Rao: గరికపాటి నరసింహారావు.. పరిచయం అక్కరలేని పేరు.. ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా ఆయనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మంచి గుర్తింపు ఉంది. మోటివేషన్‌ ప్రవచనాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆధ్యాత్మిక వేత్తగా కూడా గుర్తింపు ఉంది. అయితే అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో ఓ సినిమా కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. తర్వాత పుష్ప సినిమాపై మాట్లాడారు. గంధపు చెక్కల దొంగ హీరో ఏంటి అని ప్రశ్నించారు. దీంతో అల్లు అర్జున్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ రెండు విమర్శలకు కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

మధ్యాహ్న భోజనం వద్దట..
పేద పిల్లలను బడిబాట పట్టించేందుకు.. అక్షరాస్యత పెంచేందుకు, బడీడు పిల్లలు పనికి వెళ్లకుండా చూసేందుకు ప్రభుత్వాలు మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నాయి. అయితే ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పు పట్టారు. భోజనం గుడ్డు పెడితే పిల్లలు శోభనం పెళ్లికొడుకులా మంచం ఎక్కి కూర్చుటారని, చదువు మానేసి భోజనంపైనే దృష్టి పెడతారని పేర్కొన్నరు. అంతటితో ఆగకుండా భోజనంలో బల్లులు పడక ఇంకే పండతాయి. భోజనం పెట్టడం మానేయండి.. భోజనం కోసం బడికి రావడం మానేయండి. చదువుకునేందుకు బడికి రండి.. ఇంటి నుంచే భోజనం తెచ్చుకోండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అన్నివర్గాల నుంచి విమర్వలు వస్తున్నాయి.

మధ్యాహ్న భోజనంతో లాభమే..
దేశంలో 12 కోట్లకు పైగా పిల్లలకు ఈ పథకం ఆహారం అందిస్తోంది. పిల్లలపై పెట్టే ప్రతీ రూపాయిని పెట్టుబడిగానే భావించాలి. పిల్లలే రేపటి పౌరులు. భవిష్యత్‌ జాతి నిర్మాతలు. అందుకే భోజనం అందిస్తున్నాయి. పిల్లల్లో పోషకాహారం మెరుగుపడటం, హాజరు పెరగడం (20–30%), డ్రాప్‌ఔట్‌లు తగ్గడం ప్రధాన లాభాలు. రాష్ట్రాల్లో ఎఈ్క 1–2% పెరిగే అవకాశం కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఆహార నాణ్యత, హైజీన్‌ సమస్యలు, ఉపాధ్యాయులపై అదన భారం. గరికిపాటి మాటలు ఈ లోపాలను హైలైట్‌ చేసినట్లు కనిపిస్తున్నాయి.

అనేక అంశాలు ఉన్నా..
తాజాగా వైరల్‌ అవుతున్న వ్యాఖ్యలను గరికిపాటి టీమ్, పూర్తి సందర్భం లేకుండా క్లిప్‌లు కట్‌ చేశారని పేర్కొంటోంది. ఆయన ప్రసంగాలు సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి, ప్రభుత్వాలను సవాలు చేస్తాయి. కానీ తాజా వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారితీసింది. కొందరు ఆయనను మద్దతు చేస్తూ, మరికొందరు పథకాన్ని సమర్థిస్తున్నారు. కొందరు ప్రభుత్వాల వైఫల్యాలు అనేకం ఉన్నాయని, పేదల విద్యపై ఏడుపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాలు భోజనంతోపాటు బోధనపైనా దృష్టి పెట్టాలి. ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ల ద్వారా మానిటరింగ్‌ మెరుగుపరచవచ్చు. పిల్లల అభివృద్ధికి ఆహారం అవసరం కానీ, చదువు ఆకర్షణకు క్రియేటివ్‌ టీచింగ్‌ కీలకం. రాబోయే రోజుల్లో పాలసీ మార్పులు రావచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper