Jagan Press Meet Highlights: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అనేక పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేక ప్రారంభం అయిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ఘోర పరాజయం నుంచి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు. త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. మరోవైపు గతానికి భిన్నంగా ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా ప్రకటించారు. అయితే జగన్ ధీమా పెరుగుతోంది. అయితే దీని వెనుక ఉన్న లెక్క అర్థం కావడం లేదు.
కూటమి ఫెయిల్ అంటూ ప్రచారం..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నది జగన్ అభిప్రాయం. ప్రజల సమస్యలు ప్రభుత్వంతో పరిష్కారం కానందున వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతున్నారని అభిప్రాయపడ్డారు జగన్. ఏడాదికాలంగా ప్రజల పక్షం వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తేల్చి చెప్పారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ప్రజలు గుర్తించారని.. అందుకే వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి తనను కలుస్తున్నారని గుర్తు చేశారు జగన్. మరో మూడేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. కళ్ళు మూసుకుంటే మూడేళ్ల కాలం అయిపోతుందని తేల్చి చెప్పారు జగన్. దీనిని చూసి తట్టుకోలేక చంద్రబాబు అణచివేత ధోరణికి పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Also Read: TDP Second Governor Nominee: టిడిపికి రెండో గవర్నర్.. ఛాన్స్ ఆయనకే?!
అధికారుల్లో సైతం అనుమానాలు..
మరోవైపు అధికారులు కూడా కూటమి ప్రభుత్వ పాలన పట్ల విముఖతగా ఉన్నారని గుర్తు చేశారు జగన్ మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి వారిని టీజీ స్థాయి అధికారులు అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సంజయ్, పివి సునీల్, కాంతిరాణా టాటా వంటి సీనియర్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సస్పెన్షన్ వేటు వేశారని గుర్తు చేశారు. చాలామందికి పోస్టింగులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. తమకు అనుకూలమైన అధికారులను పెట్టుకుని విపక్షాలను వేధిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లాయని.. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి.
ఆ సర్వేల ఫలితాలతోనే..
అయితే జగన్ అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకవైపు సర్వే సంస్థలు కూటమి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రజలు బాగానే పనిచేస్తున్నాయని అవే సర్వేలు చెబుతున్నాయి. అందుకే జగన్ ఇలా దూకుడు పెంచారని తెలుస్తోంది. గతంలో మీడియాతో మాట్లాడేందుకు జగన్ ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అదే మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు గట్టి కామెంట్స్ చేస్తున్నారు. మూడేళ్లలో మనమే వస్తాం అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా వైనాట్175 అన్నారు. కానీ ప్రజలు మాత్రం 11 సీట్లు ఇచ్చారు. అప్పట్లో అతి ధీమా అలా బెడిసి కొట్టింది. ఇప్పుడు కూడా అటువంటి ధీమా కనబరుస్తున్నారు. దీనిపైనే భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?
3 ఏళ్లలో #ChandrababuNaidu ప్రభుత్వం పోతుంది.. @YSRCParty పార్టీ వస్తుంది అని ప్రజలకు తెలిసిపోయింది.
అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన ప్రజల నా దగ్గరకు వస్తున్నారు.. అది చూసి చంద్రబాబు తట్టుకోలేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు – మాజీ సీఎం @ysjagan pic.twitter.com/uMCghn9LRF
— greatandhra (@greatandhranews) July 16, 2025