AP Microsoft Quantum Valley: ఏపీకి( Andhra Pradesh) గుడ్ న్యూస్. మరో దిగ్గజ పరిశ్రమ ఏపీకి రానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటం వ్యాలీకి వస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ పసరత్తు ప్రారంభించింది. క్వాంటం కంప్యూటర్ తీసుకురానుంది. ఇందుకు సంబంధించి అధికారులతో చర్చలు కూడా జరిగాయి. త్వరలో ఏపీ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఎంవోయూ కుదరనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఐబీఎం బాటలోనే మైక్రోసాఫ్ట్ నడవనుంది. ఐబీఎం సంస్థ క్వాంటం కంప్యూటర్ కు భిన్నంగా మైక్రోసాఫ్ట్ మరో క్వాంటం కంప్యూటర్ ఉండనుంది.
త్వరలో స్పష్టత..
సాంకేతికంగా అత్యున్నతంగా క్వాంటం కంప్యూటర్లు( quantum computers ) సేవలందించునున్నాయి. వీటిలో సూపర్ కండక్టింగ్, ట్రాప్డు అయాన్, పోటానిక్, టోపో లాజికల్, న్యూట్రల్ ఆటమ్ లు ఉన్నాయి. అమరావతిలో క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ కొత్త భవనం కట్టనుంది. ఇది నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ఈ భవనం మైక్రోసాఫ్ట్ కడుతుందా? ప్రభుత్వం కట్టి ఇస్తుందా అన్నది తెలియడం లేదు. ఎంవోయూ సమయంలో దీనిపై స్పష్టత రానుంది.
Also Read: Jagan Press Meet Highlights: 3 ఏళ్లలో టీడీపీని దించి అధికారంలోకి.. అసలు జగన్ ధీమా ఏంటి?
అమరావతిలో అందుకే..
వాస్తవానికి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో 50 క్యూ బిట్స్ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేసింది. అయితే క్వాంటం టెక్నాలజీ పై ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అమరావతిలో పరిశోధనా కేంద్రం కోసం ఎంచుకుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ హైదరాబాదులో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి క్వాంటం వ్యాలీలో 90 లక్షల చదరపు అడుగుల సదుపాయాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 40 చదరపు అడుగులు ఐబీఎం కోసం, ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీల కోసం ఒక భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తుండడంతో ప్రపంచ దిగ్గజ సంస్థల చూపు అమరావతి పై పడే అవకాశం ఉంది.
ఆ సంస్థలన్నీ చూసేలా..
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్( Google), అమెజాన్, అయాన్ క్యు వంటి సంస్థలు క్వాంటం కంప్యూటింగ్ రంగంలో అనేక సాంకేతికలపై పరిశోధనలు చేస్తున్నాయి. అమరావతిలో క్వాంటం వ్యాలీకి సంబంధించి అనుకూల వాతావరణం ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు టార్గెట్. తద్వారా ప్రపంచంలో క్వాంటం ద్వారా రాణించాలనుకుంటున్న దిగ్గజ సంస్థలను తన వైపు తిప్పుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యం. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ అమరావతికి వస్తే మాత్రం.. ఒక విధంగా చెప్పాలంటే అనుకూల వాతావరణం ఏర్పాటు అవుతుంది. స్వల్ప కాలంలోనే అమరావతి క్వాంటం వ్యాలీ అంతర్జాతీయ స్థాయికి ఎక్కడం ఖాయం.