spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Elections Result 2024 : అన్ని పార్టీల్లో అదే ఉత్కంఠ.. బయటకు ధీమా.. లోపల...

AP Elections Result 2024 : అన్ని పార్టీల్లో అదే ఉత్కంఠ.. బయటకు ధీమా.. లోపల గుబులు

AP Elections Result : నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో ఏపీలో పాలకపక్షం ఎవరు అనేది తెలుస్తుంది. గత నెల 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోలింగుకు, కౌంటింగ్ కు మధ్య మూడు వారాల వ్యవధి రావడంతో మరింత గందరగోళానికి దారితీసింది. గెలుపు మాదంటే మాది అని అన్ని పార్టీల నేతలు ధీమా కనబరిచారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంత క్లారిటీ వస్తుందని అంతా భావించారు. అయితే లోకల్ ఎగ్జిట్ పోల్ సంస్థలు అధికార వైసీపీకి జై కొట్టగా.. జాతీయ సంస్థలు మాత్రం టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా రావడంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు సామాన్య జనాలు సైతం కన్ఫ్యూజన్లో ఉండిపోవాల్సి వచ్చింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడం కూడా అన్ని పార్టీలు తమకు అన్వయించుకుంటున్నాయి. తమకే కలిసి వస్తుందని భావిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని.. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో.. తమకు లభిస్తుందని కూటమి అంచనా వేసింది.మరోవైపు పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలమని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వారు తమకే ఓటు వేశారని వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. కొత్తగా ఓటు పొందిన ఎనిమిది లక్షల మంది మహిళలు తమకు అండగా నిలిచారని వైసీపీలో ధీమా కనిపిస్తోంది.అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ సైతంభిన్నంగా ఫలితాలు ఇవ్వడం మరింత అనుమానాలను పెంచింది.

కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించిన అన్ని పార్టీలు.. తమ పార్టీ అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూటమి అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విజయం పై ధీమా వ్యక్తం చేశారు. ఏకపక్ష ఫలితాలు రానున్నాయని.. చివరి వరకు కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుది ఫలితాలు తరువాత అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నాకే బయటకు రావాలని సూచించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులతో నేరుగా మాట్లాడారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులను హైదరాబాదుకు రప్పించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైసిపి కవ్వింపు చర్యలకు స్పందించ వద్దని కూడా విజ్ఞప్తి చేశారు.

వైసీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమీక్షించారు. నేరుగా వైసీపీ అభ్యర్థులతో మాట్లాడారు. కౌంటింగ్ ఏజెంట్లకు మార్గ నిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా ఉండవద్దని.. చివరి వరకు కేంద్రాలను విడిచి పెట్టొద్దని సూచించారు. మొత్తానికైతే నరాల తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఏపీలో విజేత ఎవరు అనేది తేలనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version