https://oktelugu.com/

T20 World Cup 2024: అరుదైన ఘనతకు.. పది పరుగుల దూరంలో.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు..

T20 World Cup 2024: ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో(Bangladesh Team) జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడలేదు. ఎందుకంటే అతడు వీసా సంబంధిత పేపర్ వర్క్ వల్ల కాస్త ఆలస్యంగా అమెరికా బయలుదేరి వెళ్ళాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 3, 2024 / 03:01 PM IST

    Another record for Virat Kohli

    Follow us on

    T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లోనే అమెరికా, కెనడా జట్లు పరుగుల వరద పారించాయి. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్ లలో కూడా బ్యాటర్లదే హవా అని తేలిపోయింది. దీంతో మిగతా జట్ల ఆటగాళ్లు అరుదైన రికార్డులను సాధించేందుకు తహతహలాడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ఉన్నాడు. పరుగుల యంత్రంగా పేరు పొందిన ఇతడు మరో 10 పరుగులు చేస్తే సరికొత్త రికార్డును తన ఖాతాలో లిఖించుకునే అవకాశం ఉంది.

    ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో(Bangladesh Team) జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడలేదు. ఎందుకంటే అతడు వీసా సంబంధిత పేపర్ వర్క్ వల్ల కాస్త ఆలస్యంగా అమెరికా బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ముఖ్యంగా టీమ్ ఇండియా బ్యాటర్లకు ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది..

    జూన్ 5న ఐర్లాండ్ జట్టుతో(Ireland Team) జరిగే మ్యాచ్ ద్వారా టీమిండియా తన టి20 వరల్డ్ కప్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ నేరుగా రంగంలోకి దిగుతాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఫలితంగా ఈ వరల్డ్ కప్ లో అందరి ఆటగాళ్ల దృష్టి విరాట్ మీదే ఉంది. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫామ్ ను టి20 వరల్డ్ కప్ లో కొనసాగిస్తే టీమిండియా కు ఎదురు అనేదే ఉండదని క్రీడా విశ్లేషకులు, అభిమానులు చెబుతున్నారు.

    Also Read: Nitish Reddy: మీకేమైనా పిచ్చా? నేను ధోనిని ఎందుకు అవమానిస్తాను? అసలు వీడియో చూశారా?

    ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఏ ఆటగాడు అందుకోలేని రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. స్థిరమైన ఆటతీరుకు సిసలైన పర్యాయపదంగా విరాట్ కోహ్లీ మారాడు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో పరుగుల మీద పరుగులు చేశాడు. టి20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఏకంగా రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. 81.50 సరాసరితో ఏకంగా 1141 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో కోహ్లీ ఆడినప్పటికీ 2007 తర్వాత మరోసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకోలేకపోయింది.

    ఇక ప్రస్తుతం కోహ్లీ ముందు అనేక రికార్డులు ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే చివరి టి20 వరల్డ్ కప్ అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి చాలా కాలం గడిచింది. 2007 తర్వాత మరొక కప్ కోసం టీమిండియా పోరాడుతూనే ఉంది.. ఈసారి టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతున్న టీమ్ ఇండియాకు కోహ్లీ ఫామ్ అనేది అత్యంత ముఖ్యం. ఈ దశలో అనేక రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయి.

    Also Read: T20 World Cup 2024: భారత్ తో మ్యాచ్ అంటే మాపై ఒత్తిడి ఉంటుంది… పాక్ కెప్టెన్ భయపడ్డాడా?

    టి20 ప్రపంచ కప్ కెరియర్లో ధోని 33 మ్యాచ్లలో చివరి ఓవర్లలో 311 పరుగులు చేశాడు. కోహ్లీ 25 మ్యాచులలో డెత్ ఓవర్లలో 302 పరుగులు చేశాడు. బెస్ట్ ఫినిషర్ గా పేరు పొందిన ధోని రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీ మరో 10 పరుగులు చేస్తే చాలు.

    ఐసిసి టి20 వరల్డ్ కప్ చరిత్రలో డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. 157.8 సరాసరితో 311 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 194.8 స్ట్రైక్ రేట్ తో 302 పరుగులు చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డీవిలియర్స్ 203.7 స్ట్రైక్ రేట్, 237 రన్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ 162.7 స్ట్రైక్ రేట్, 262 రన్స్ తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మైక్ హాసి 189.7 స్ట్రైక్ రేట్ తో 260 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.