https://oktelugu.com/

Heroine: 9 ఏళ్లలో ఒక్క హిట్ లేదు, అయినా సినిమాకు రూ. 40 కోట్లు, ఇండస్ట్రీ వెలివేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Heroine: అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. సరోగసీ పద్దతిలో ఓ కూతురిని కన్నది. హిందీ పరిశ్రమ నుండి వెలివేయబడ్డ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 3, 2024 / 02:49 PM IST

    Priyanka Chopra Remuneration per movie

    Follow us on

    Heroine: ఆ హీరోయిన్ కి గత 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. అయినా సినిమాకు రూ. 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు. హాలీవుడ్(Hollywood) లో రాణిస్తుంది. అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. సరోగసీ పద్దతిలో ఓ కూతురిని కన్నది. హిందీ పరిశ్రమ నుండి వెలివేయబడ్డ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీరు ఊహించింది నిజమే… సదరు హీరోయిన్ ప్రియాంక చోప్రా.

    మోడల్ అయిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కొట్టింది. ఆమె మొదటి చిత్రం తమీజన్. విజయ్ హీరోగా 2002లో విడుదలైంది. అనంతరం ఆమె వరుసగా హిందీ చిత్రాలు చేసింది. సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలైనప్పటికీ ప్రస్థానం బాలీవుడ్ లో సాగించింది. ఒక దశలో టాప్ హీరోయిన్ గా హిందీ చిత్ర పరిశ్రమను ఏలింది. షారుఖ్, సల్మాన్, హృతిక్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది.

    Also Read: OG Movie: ఓజీ రిలీజ్ మీద ఆందోళన పడుతున్న పవన్ అభిమానులు…

    2016 తర్వాత ప్రియాంక చోప్రా బాలీవుడ్(Bollywood) కి దూరం అవుతూ వచ్చింది. హిందీ చిత్రాలు చేయడం తగ్గించింది. 2017లో బేవాచ్ టైటిల్ తో హాలీవుడ్ మూవీ చేసింది. డ్వేన్ జాన్సన్ ఈ మూవీలో హీరోగా నటించాడు. హాలీవుడ్ లో వరుస ఆఫర్స్ పెట్టేస్తూ అక్కడే బిజీ అయ్యింది. ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సినిమాకు రూ. 40 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

    Also Read: Star Heroine: ప్రభాస్ తో నటించాలంటే ఆయన నా ఇంటికి… స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

    ప్రియాంక చోప్రా హిందీలో చిత్రాలు చేయకపోవడానికి కారణం ఏమిటో వెల్లడించింది. ఒక వర్గం తనకు ఆఫర్స్ రాకుండా అడ్డుకుందని ఆమె ఆరోపణలు చేశారు. బాలీవుడ్ లోని రాజకీయాలు నేను తట్టుకోలేకపోయాను. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. కొందరు నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అందుకే హిందీ చిత్ర పరిశ్రమను వదిలేశాను… అని ప్రియాంక చోప్రా అసహనం వ్యక్తం చేసింది. 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానం.