spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu strong warning to Pithapuram Varma: గొడవలు పడితే ఇక క్షమించను అంటూ పిఠాపురం...

Chandrababu strong warning to Pithapuram Varma: గొడవలు పడితే ఇక క్షమించను అంటూ పిఠాపురం వర్మకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. వీడియో వైరల్..

Chandrababu strong warning to Pithapuram Varma: ఒకపక్క సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) 15 ఏళ్ళ పాటు కూటమి అధికారం లో ఉండాలని పరస్పరం చెప్తూ ఉంటారు. ఏ ముహూర్తం లో వీళ్లిద్దరి బంధం ఏర్పడిందో తెలియదు కానీ, ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ , అభిమానం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో ఎవరికీ ఇవ్వనంత గౌరవాన్ని పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నాడు. ఇక నారా లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ ని తన సొంత అన్నయ్య లాగా భావిస్తున్నాడు. కూటమిలోని అగ్రశ్రేణి నాయకత్వం ఇంత బలమైన బంధం తో కొనసాగుతుంటే , మరో పక్క క్షేత్ర స్థాయిలో మాత్రం ఈమధ్య కాలం లో టీడీపీ , జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతీ చిన్న విషయానికి కొట్టుకుంటున్నారు. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుపై అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ అసంతృప్తి గానే ఉన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రీసెంట్ గా ఫ్లెక్సీల విషయం లో టీడీపీ , జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఏ రేంజ్ లో గొడవ పడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాస్తవానికి గోరుతో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చాడు , టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. సీనియర్ నాయకుడిగా , పార్టీ కార్యకర్తలను సమన్వయంతో ఉండేలా చేయాల్సింది పోయి, ప్రతీ చిన్న విషయానికి గొడవపడి వర్మ తీరు ని సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు తప్పుబట్టారు. నేడు కూడా ఆయన పరోక్షంగా పిఠాపురం లో జరిగిన ఈ సంఘటన పై మాట్లాడుతూ వర్మ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ని నియమించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గం తో నేడు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నూతన కార్యవర్గానికి , పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను , పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినా ఎంతో ఆత్మీయంగా ఉంటాము. కూటమి ఐక్యత ని కాపాడేవిధంగా మా అడుగులు ఉంటాయి . మా ద్వారా క్షేత్ర స్థాయి లో మూడు పార్టీల కార్యకర్తలు , నాయకులూ ఎలా ఉండాలో సందేశం అందించాము. కానీ ఈమధ్య కాలం లో చూస్తున్నాను. కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. అధికారం లో ఉన్నాం కదా అని ఈగోలకు పోతే మీకే నష్టం. చిన్న గొడవలు కూడా జరగకూడదు , ముఖ్యంగా ఫ్లెక్సీల విషయంలో, ఫోటోల విషయం లో , కుర్చీల విషయం లో గొడవలు రాకూడదు , వస్తే ఉపేక్షించేది లేదు’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper