Homeక్రీడలుక్రికెట్‌Bhuvneshwar Kumar performance: SRH వదులుకున్న వజ్రాయుధం ఇతడు.. 36 ఏళ్ల వయసులో అద్భుతం చేస్తున్నాడు..

Bhuvneshwar Kumar performance: SRH వదులుకున్న వజ్రాయుధం ఇతడు.. 36 ఏళ్ల వయసులో అద్భుతం చేస్తున్నాడు..

Bhuvneshwar Kumar performance: ఐపీఎల్ లో ప్లాట్ మైదానాల మీద పరుగులు తీయడం పెద్ద కష్టం కాదు. అటువంటి మైదానాల మీద బంతులను వేయడం అత్యంత కష్టం. పైగా ఆ బంతులతో వికెట్లు తీయడం మరింత కష్టం. పెద్ద పెద్ద బౌలర్లకు ఇది సాధ్యం కావడం లేదు. వందల వికెట్లు తీసిన అనుభవం ఇక్కడ పనికి రావడం లేదు. కానీ ఇతడు వికెట్లు ఈజీగా తీస్తున్నాడు. ప్లాట్ మైదానాల మీద బంతులను అత్యంత భిన్నంగా వేస్తున్నాడు. అంతేకాదు […]

Bhuvneshwar Kumar performance: ఐపీఎల్ లో ప్లాట్ మైదానాల మీద పరుగులు తీయడం పెద్ద కష్టం కాదు. అటువంటి మైదానాల మీద బంతులను వేయడం అత్యంత కష్టం. పైగా ఆ బంతులతో వికెట్లు తీయడం మరింత కష్టం. పెద్ద పెద్ద బౌలర్లకు ఇది సాధ్యం కావడం లేదు. వందల వికెట్లు తీసిన అనుభవం ఇక్కడ పనికి రావడం లేదు. కానీ ఇతడు వికెట్లు ఈజీగా తీస్తున్నాడు. ప్లాట్ మైదానాల మీద బంతులను అత్యంత భిన్నంగా వేస్తున్నాడు. అంతేకాదు పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు.

ఇంతటి ఉపోద్ఘాతం బుమ్రా కో.. మరో బౌలర్ కో కాదు. ఇంతటి ఉపోద్ఘాతం కూడా వారికి దక్కే స్థాయిలో బౌలింగ్ వేయడం లేదు. కానీ ఇతడు మాత్రం అదరగొడుతున్నాడు. అతడి పేరు భువనేశ్వర్ కుమార్.. హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతంగా బౌలింగ్ వేసిన అతడు.. మేనేజ్మెంట్ నిర్ణయం వల్ల బెంగళూరుకు మారిపోయాడు. బెంగళూరు జట్టులో కీలక బౌలర్గా అవతరించాడు. ఆ జట్టు విజయాలలో ముఖ్య భూమిక అతడు పోషిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ జట్టు కుప్పకూలిపోవడానికి భువనేశ్వర్ కుమార్ ప్రధాన కారణం. అద్భుతమైన ఇన్ స్వింగర్ బంతులతో అతడు ఢిల్లీ బ్యాటర్లకు ముచ్చెమటలు పోయించాడు..

ప్రస్తుత ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఎనిమిది ఇన్నింగ్స్ లలో బౌలింగ్ వేశాడు. 14 వికెట్లు పడగొట్టాడు. యావరేజ్ 16.86, ఎకానమీ 7.61 గా కొనసాగిస్తున్నాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 13.29. ఉత్తమ ప్రదర్శన 3/5 గా ఉందంటే ఇతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అన్నట్టు ఇతడి వయసు 36 సంవత్సరాలు. యంగ్ ప్లేయర్లు దుమ్మురేపుతున్న ఐపీఎల్లో.. స్థిరమైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు భువనేశ్వర్.

హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ ఇతడిని ఎందుకు వదిలేసుకుందో తెలియదు. కానీ బెంగళూరు జట్టుకు వెళ్లిపోయిన తర్వాత తన బౌలింగ్ లయను పూర్తిగా మార్చుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా మారిపోయాడు. అంతేకాదు కాకలు తీరిన బ్యాటర్లను వెనక్కి పంపించడం అలవాటుగా చేసుకున్నాడు. అందువల్లే భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ.. నాకు నేనే పోటీ.. లేరెవరు సాటి అన్నట్టుగా భువనేశ్వర్ కుమార్ చెలరేగి బౌలింగ్ వేస్తున్నాడు. అందువల్లే ఐపిఎల్ లో తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper