AP IAS Transfers: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. వ్యవస్థలు మొత్తం నాశనమయ్యాయి. ఇందుగలదు అందులేదు అన్నట్టుగా అన్ని వ్యవస్థలలో కూడా జగన్ మనుషులు ఉన్నారు. మొత్తంగా ఏపీ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే కొన్ని శాఖలలో జగన్ మనుషులు ఇప్పటికీ ఉండడంతో.. కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. అయితే ఇటీవల జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి అధికారి చేసిన గూడుపుఠాణి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైన ఐఏఎస్ అధికారి ఇటీవల హైదరాబాద్.. తాడేపల్లి ప్రాంతంలో కీలకమైన సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు ఏపీలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు హాజరయ్యారు. ఈనెల 6న న్యాయస్థానంలో పనిమీద ఐఏఎస్ అధికారి ఏపీ రాష్ట్రానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కొంతమంది ఐఏఎస్ అధికారులను కలిశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆరా తీశారు. తాడేపల్లి ప్రాంతంలో స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమానికి చాలామంది అధికారులు హాజరయ్యారు .
హైదరాబాదులో ఒక ఐపీఎస్ ఇంట్లో కూడా ఇదే స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే ఒక విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి హాజరుకావడమే కాదు.. కొంతమంది అధికారులను కూడా సమీకరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, హైదరాబాద్, తాడేపల్లి ప్రాంతాలలో నిర్వహించిన సమావేశాలలో పాల్గొన్న అధికారుల వివరాలు.. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లను ప్రభుత్వం తెప్పించుకుంది. అన్ని వివరాలను సేకరించింది.
ఈ వ్యవహారంలో నీలకంఠారెడ్డి అనే అధికారికి ఈలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. రెండు విడతలుగా నిర్వహించిన సమావేశాలలో నీలకంఠారెడ్డి కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. సమావేశానికి హాజరైన అధికారులు మొత్తం ప్రభుత్వంలో పని చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని వేరే వ్యక్తులకు అందించడం వివాదాస్పదమైంది. ఇక నాటి వైసీపీ ప్రభుత్వంలో ఓ ఐ ఎస్ అధికారి కీలకంగా పనిచేశారు. ఆయనకు ఓఎస్డిగా నీలకంఠారెడ్డి వ్యవహరించారు. 2023లో సదరు అధికారి నాన్ ఎస్ సీ ఎస్ కోటా కింద ఏఎస్ అయ్యారు. ఆ అధికారి 2023 వరకు ఆయన మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఎండిగా పని చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు..
కొంతకాలం క్రితం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండిగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. సరిగ్గా మూడు నెలల క్రితం ఆరోగ్యశాఖలో ఫుడ్ సేఫ్టీ విభాగానికి డైరెక్టర్ గా అదనపు బాధ్యతలతో నియమించింది. అయితే గూడుపుఠాణి వ్యవహారంలో ఆ అధికారి పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం వేటు వేసింది. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అతడిని వెంటనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండి బాధ్యతలనుంచి తప్పుకోవాలని.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఆ అధికారి మాత్రమే కాకుండా.. మిగతా వారిపై కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
