Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) కు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా ముస్లింల నుంచి ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరిగి ప్రవేశ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారు. మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబుతో పాటు నితీష్ లపై ఆగ్రహంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందుకు మెజారిటీ ముస్లింలు గైరహాజరయ్యారు. బీహార్ లో అయితే పూర్తిగా బహిష్కరించారు. ఏపీలో బహిష్కరిస్తామని హెచ్చరికలు పంపారు. కానీ కూటమి ఒత్తిడి చేయడంతో కొంతమంది ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. అయితే ఏపీలో పట్టు బిగించి చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ముస్లింలు సిద్ధపడుతుండడం విశేషం.
Also Read : చంద్రబాబుకు పాదాభివందనం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ!
* ముస్లింల మద్దతుతో
గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి( TDP Alliance) మద్దతు తెలిపారు ముస్లింలు. కానీ కేంద్రం తమ హక్కులను కాలరాసే విధంగా బిల్లు తేవడంపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు వినతి పత్రాలు అందించారు. అయినా సరే కేంద్రం తన చర్యలను ప్రారంభించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముస్లింలు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎక్కువ శాతం గైర్హాజరయ్యారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతాలు పంపారు. మున్ముందు కూటమికి వ్యతిరేకంగా మారుతామని గట్టిగానే హెచ్చరికలు పంపుతున్నారు ముస్లింలు.
* భారీ నిరసనకు పిలుపు
ఏపీలో భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ముస్లిం పర్సనల్ లా బోర్డ్( Muslim personal law board ). ఇఫ్తార్ విందుకు గైర్హాజరుకావాలని ఈ బోర్డు పిలుపునివ్వడంతో కూటమిలో ఉన్న ముస్లిం నేతలు తప్ప అటువైపుగా ఎవరూ చూడలేదు. దీంతో అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉద్దేశంతో రేపు మహా ధర్నాకు పిలుపునిచ్చింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. విజయవాడలో భారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయవాడలోని ధర్నా చౌక్ లో మహా ధర్నా చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చింది సంబంధిత బోర్డు.
* చంద్రబాబుపై ఒత్తిడికే
అయితే వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని టిడిపి ఫై ( Telugu Desam )ఒత్తిడి పెంచే క్రమంలోనే ముస్లింలు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు దీనిపై కీలక ప్రకటన చేశారు. ముస్లింల ఆస్తుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేరుగా ఈ బిల్లును వ్యతిరేకించనని చెప్పలేదు. ముస్లింలలో ఆగ్రహానికి అదే కారణం. అయితే ఏపీవ్యాప్తంగా ముస్లింలు ఏకమవుతుండడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ముస్లిం మైనారిటీ మంత్రి ఒకరు ఉన్నారు. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ముస్లింల నిరసన కార్యక్రమాలు నిలిపివేస్తారా? కొనసాగిస్తారా అన్నది తెలియాలి.
Also Read : చంద్రబాబు నోట ‘పి4’ మాట.. దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా?