Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu and Harish Rao : చంద్రబాబును పొగుడుతున్న హరీష్ రావు.. ఏంటి కథ?

Chandrababu Naidu and Harish Rao : చంద్రబాబును పొగుడుతున్న హరీష్ రావు.. ఏంటి కథ?

Chandrababu Naidu and Harish Rao : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) తెలంగాణపై దృష్టి పెట్టారా? టిడిపిని బలోపేతం చేయాలని చూస్తున్నారా? టిడిపి రాష్ట్ర పగ్గాలు సమర్థవంతమైన నేతకు అప్పగించాలని భావిస్తున్నారా? ఇప్పటికే ఆ నేత దొరికారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం బిజెపితో జతకట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అంతకుముందు సరైన నేతకు టిడిపి పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో టిడిపి రాష్ట్ర పగ్గాలు ఓ నేతకు అప్పగిస్తారని తెగ ప్రచారం నడుస్తోంది.

Also Read : భువనేశ్వరి కోసం.. ఓ చీరను సెలెక్ట్ చేసిన చంద్రబాబు!

* చాలా రోజులుగా అధ్యక్ష పదవి ఖాళీ
2023 తెలంగాణ( Telangana) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కాసాని జ్ఞానేశ్వర్ కు టిడిపి రాష్ట్ర పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలను కూడా పెంచారు. అయితే ఇంతలో అప్పటి జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్టు చేసింది. 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో.. టిడిపి పోటీకి దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది. అయితే ఆ నిర్ణయంతో మనస్థాపానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దాని భర్తీపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసినా.. నియామకం మాత్రం చేపట్ట లేకపోయారు.

* తెరపైకి ప్రముఖుల పేర్లు..
అయితే ఇటీవల చాలా రకాల పేర్లు తెరపైకి వచ్చాయి. నందమూరి సుహాసిని( Nandamuri Suhasini ), అరవింద్ కుమార్ గౌడ్.. ఇలా చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బి ఆర్ఎస్ కు చెందిన హరీష్ రావు పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే పార్టీ మారతారని.. తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందిస్తే తీసుకుంటారని తెలంగాణలో కొత్త టాక్ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే హరీష్ రావు ఇటీవల చంద్రబాబును పొగుడుతున్నారు. చాలా వేదికల వద్ద చంద్రబాబు గొప్పతనం ప్రస్తావిస్తున్నారు. దీంతో హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. తొలు త హరీష్ కుమార్ బిజెపిలోకి వెళ్తారని టాక్ నడిచింది. కానీ అక్కడకు వెళ్తే సాధారణ గౌరవం మాత్రమే దక్కుతుందని.. టిడిపిలోకి వెళ్తే నాయకత్వ బాధ్యతలు ఇస్తారని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Also Read : కేసీఆర్‌ సభతో కాంగ్రెస్‌లో టెన్షన్‌ ఉందా?

* బిఆర్ఎస్ లో తగ్గిన గుర్తింపు
ఇటీవల బిఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ హరీష్ రావుకు( Harish Rao ) ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కనీసం ప్రాంగణంలో హరీష్ రావు ఫోటో కూడా ఏర్పాటు చేయలేదు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉంటూ.. కెసిఆర్ కు అండగా ఉండేవారు హరీష్ రావు. కానీ క్రమేపి కేటీఆర్ ప్రాముఖ్యత పెరుగుతోంది. మరోవైపు టిఆర్ఎస్ పరిస్థితి కూడా మెరుగుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో బిజెపి తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీతో జతకట్టే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో టిడిపిలో చేరితే రాష్ట్ర పగ్గాలు అందుకోవచ్చు. బిజెపితో కలిపి అధికారాన్ని పంచుకోవచ్చు. అందుకే హరీష్ రావు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular