Subham Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత (Samantha)… ప్రస్తుతం నిర్మాణ రంగం వైపు అడుగులు వేసింది… ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించి మొదటి ప్రయత్నం గా శుభం అనే సినిమాను నిర్మించింది…ఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే, మరో పక్క ప్రొడ్యూసర్ గా కూడా మారింది… మరి తను మొదటిసారిగా ప్రొడ్యూసర్ గా మారి చేసిన శుభం మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే పల్లెటూర్లకి డిటిహెచ్ లు పరిచయం అవుతున్న రోజుల్లో భీముని పట్టణానికి చెందిన శ్రీను (హర్షిత్ మల్గి రెడ్డి) అనే వ్యక్తి లోకల్ కేబుల్ టీవీ నెట్ వర్క్ ను నడిపిస్తాడు… అలాగే రోజు తన ఊర్లో తన స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో శ్రీను కి పోటీగా డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) వచ్చి ఆ ఊరి ప్రజలకు డిటిహెచ్ ని పరిచయం చేయాలని చూస్తుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీను, డిష్ కుమార్ కి మధ్య బిజినెస్ పరంగా తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది…ఇక బిజినెస్ ని చాలా సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్న శ్రీనుకి బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి(శ్రియ కొంతం) అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది.
ఇక పెళ్లై వాళ్ళ మొదటి రాత్రి రోజు టీవీలో ‘జన్మజన్మల బంధం’ అనే సీరియల్ చూస్తున్న శ్రీవల్లి చాలా వింత వింతగా ప్రవర్తిస్తుంది.ఆ సీరియల్ ముగిసిన తర్వాత మళ్లీ నార్మల్ అవుతుంది. ఇక శ్రీవల్లి అనే కాదు ఆ సీరియల్ చూస్తున్న తన స్నేహితుల భార్యలు సైతం అలాగే వింత వింత చేష్టలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని బయట జనాలతో చెబితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఈ ముగ్గురు ఎవ్వరికి చెప్పకుండా వల్ల బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. అసలు ఎందుకని జన్మజన్మల బంధం సీరియల్ చూసినప్పుడు వీళ్ళకి ఆత్మలు వహిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ మామూలు మనుషులుగా ఎందుకు మారిపోతున్నారు.
అసలు ఈ ఆత్మల వెనుక రహస్యం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వీళ్లతో పాటుగా ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ సీరియల్ చూస్తున్న సమయంలో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న వీళ్ళు దానికి ఎలాంటి సొల్యూషన్ చూపించారు. అసలు ఆ ఆత్మలకి, ఆ ఊరు ఆడవాళ్ళకి మధ్య సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమా కోసం హర్రర్ కామెడీ నేపథ్యాన్ని ఎంచుకొని మంచి పని చేశాడు. ఒక రకంగా ఈ సినిమాని అందులో ఉన్న ప్లాట్ పాయింట్ ను ప్రేక్షకుడికి వివరంగా చెప్పాలి అంటే ఒక జానర్ కి స్టిక్ అయిపోయి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కానీ హర్రర్ కామెడీ అనేది ఎప్పుడు సక్సెస్ ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా దర్శకుడు ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తే మాత్రం సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఈ సినిమాను మొదటి నుంచి ఎంగేజింగ్ గా తీసుకెళ్లిన దర్శకుడు మధ్యలో కొంతవరకు స్లో అనిపించినప్పటికి పరిచయాలు ముగిసిన తర్వాత సినిమా మెయిన్ కథలోకి ఎంటర్ అయినప్పటి నుంచి శరవేగంగా ముందుక నడుస్తూ ఉంటుంది.
ఇక అప్పటి నుంచి అసలు ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్ ఉండేలా స్క్రీన్ ప్లే ను రాసుకున్నారు. ఇక ఊర్లో ఆడవాళ్లు ఒక సీరియల్ చూస్తున్న సమయంలోనే అలాంటి ఇబ్బందులను ఎందుకు ఎదుర్కొంటున్నారు. రోజు అదే టైమ్ కి ఆత్మ వచ్చి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నుంచి హీరో అతని ఫ్రెండ్స్ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే సీన్స్ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటాయి.
ఇక ఈ సమస్యకి సమంత మాయ అనే క్యారెక్టర్ రూపంలో వచ్చి వాళ్లకి ఒక సొల్యూషన్ ని చూపించే క్రమంలో ఆమె కూడా తన కామెడీ టైమింగ్ ను చూపిస్తూ చాలా అద్భుతమైన పంచులను కూడా వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు… కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకి చాలా బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇలాంటి హర్రర్ కామెడీ సినిమా అయితే రాలేదు. అందుకే ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది… ఈ సినిమాలో ఏదైతే చూపించాలి అనుకున్నాడో దర్శకుడు ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా చాలా క్లియర్ కట్ గా ఆ ఎలిమెంట్స్ ను ప్రేక్షకుడికి చూపించి సక్సెస్ ని సాధించాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టులు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే హర్షిత్ రెడ్డి చాలా మంచి హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక తనతో పాటుగా తన ఫ్రెండ్స్ గా నటించిన శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పారి లాంటి నటులు సైతం అతనికి సపోర్ట్ చేస్తూ హర్రర్ కామెడీ లో ఉన్న కామెడీ ఎలిమెంట్స్ ను సైతం చాలా బాగా పండించే ప్రయత్నం చేశారు. ఇక వంశీధర్ గౌడ్ లాంటి నటులు సైతం ఒదిగిపోయి కామెడీ పంచులను పేల్చే ప్రయత్నం చేశారు…
శ్రియ కొంతం సైతం తన క్యారెక్టర్జేషన్స్ కి ఉన్న లిమిటెషన్స్ తెలుసుకొని ఎంతవరకు నటించాలో అంతవరకు మాత్రమే నటించి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేసింది…శ్రావణి లక్ష్మీ,షాలిని కొండేపూడి లాంటి నటీమణులు సైతం వాళ్ళ నటనతో సినిమాకి హైప్ తీసుకువచ్చారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ సెరెజో ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ అయితే అందించాడు. ముఖ్యంగా కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ కోసం ప్రత్యేకంగా బిజిఎంని చేసి మరి వాటి కోసం వాడిన విధానం అయితే బావుంది. నిజంగా హర్రర్ ఎలిమెంట్స్ లో కొన్ని సందర్భాల్లో భయాన్ని పుట్టించేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండటం సినిమాకి చాలావరకు హెల్ప్ అయింది. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లలో ఆయన ఇచ్చిన బిజిఎం సైతం బాగుంది.
అందుకే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ మూవీకి కనెక్ట్ అయిపోయి చివర వరకు ఉత్కంఠ గా సినిమాను చూస్తూనే ఉంటాడు తప్ప దాని నుంచి ఎక్కడ కూడా డివియెట్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు… ఇక సినిమాటోగ్రాఫర్ సైతం ఈ సినిమాకి చాలా మంచి విజువల్స్ అయితే అందించాడు. చిన్న సినిమా కి మేకింగ్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. కానీ సినిమాటోగ్రాఫర్ చాలా ఇన్నోవేటివ్ థాట్స్ ను వాడుతూ కొన్ని షాట్స్ ను చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు… ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ, స్క్రీన్ ప్లే
సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
లీడ్ రోల్స్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
స్టార్టింగ్ కొంచెం స్లో అయింది…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
ఈ వారం కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా…