Nagababu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) సైలెంట్ గా ఉన్నారు. తన పని తాను చేసుకుంటున్నారు. దూకుడుగా ఉండడం లేదు. అందుకు కారణాలు చెప్పలేము కానీ.. తన శాఖల పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం తన పని తాను చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు అన్ని ఆయన పరిధిలో జరుగుతున్నాయి. నామినేటెడ్ పదవుల విషయంలో సైతం లోకేష్ ఫైనలైజ్ చేస్తున్నారు. భాగస్వామి పక్షాలైన జనసేన, బిజెపికి సైతం కేటాయింపుల విషయంలో లోకేష్ ముద్ర కనిపిస్తోంది. అయితే ఇంతవరకు ప్రశాంత వాతావరణం ఉంది. కానీ జూన్ నుంచి ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నాగబాబు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తుండటమే.
Also Read : పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ.. వర్మ పేరుతో టిడిపి రచ్చ!
* ఎమ్మెల్సీ అయిన తర్వాత..
కొద్ది రోజుల కిందట నాగబాబు( Nagababu ) ఎమ్మెల్సీ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నేరుగా పిఠాపురం వెళ్లారు. పలు ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ దుమారానికి దారితీసాయి. పిఠాపురం వర్మను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ అంత వ్యూహకర్త కాదు. ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడుతారు. ఆచితూచి మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే ఆయన క్యాబినెట్ లోకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* జూన్ లో మంత్రివర్గ విస్తరణ
జూన్ లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు( CM Chandrababu) సిద్ధపడుతున్నారు. ఓ ముగ్గురు మంత్రులను పక్కనపెట్టి.. నలుగురు మంత్రులను తీసుకొనున్నారు. ఇలా తొలగిస్తున్న వారికి ఇప్పటికే సమాచారం అందించారని కూడా తెలుస్తోంది. జనసేన నుంచి నాగబాబుకు బెర్త్ ఖాయం. బిజెపికి మరో మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. నాగబాబుతో జనసేనకు కేటాయించే మంత్రి పదవులు నాలుగుకు చేరుతాయి. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నాగబాబు వస్తే మాత్రం పరిస్థితి మారుతుంది అన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంలో ప్రతి అంశంలో ఆయన జోక్యం ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే కూటమిలో అభిప్రాయ భేదాలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏదైనా కామెంట్స్ చేసేటప్పుడు ఒక వ్యూహం ప్రకారం చేస్తారు. కానీ నాగబాబు విషయంలో అలా కాదు.
Also Read : నాగబాబు అను నేను.. లైన్ క్లియర్.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
* ఆ అంచనాలో వైసిపి
నాగబాబు క్యాబినెట్ ఎంట్రీ తో కూటమిలో( Alliance ) విభేదాలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. గతంలో నాగబాబు వ్యవహార శైలి అలానే ఉండేది. సినీ పరిశ్రమలో నాగబాబు తీరు వల్లే మెగా కుటుంబానికి వ్యతిరేకులు పెరిగారన్న టాక్ ఒకటి ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో సైతం అలానే ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల టిడిపి నేతల విషయంలో నాగబాబు ప్రకటనలు అలానే ఉంటున్నాయి. అయితే ఇప్పటికే కూటమిలో సమన్వయం చక్కగా సాగుతోంది. నాగబాబు విషయంలో బ్యాలెన్స్ తప్పుతుందని వైసిపి ఆశతో ఉంది. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నాగబాబును కచ్చితంగా కట్టడి చేస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.