Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana Health Update: బొత్సకు మళ్ళీ అస్వస్థత!

Botsa Satyanarayana Health Update: బొత్సకు మళ్ళీ అస్వస్థత!

Botsa Satyanarayana Health Update: మాజీ మంత్రి, శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజులపాటు బొత్స హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. కోలుకోవడంతో ఈరోజు ఆయన శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. అయితే సభలో మాట్లాడుతున్న సమయంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు వైద్యులను పిలిపించి పరీక్ష చేశారు. బీపీ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీపీలో హెచ్చుతగ్గుల ఆయన అస్వస్థతకు కారణమని వైద్యులు ధ్రువీకరించారు. విశ్రాంతి అవసరమని చెప్పడంతో.. బొత్స ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఒక్కసారిగా బొత్స అస్వస్థతకు గురికావడంతో శాసనమండలిలో ఒక రకమైన ఆందోళన కనిపించింది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

* తరచూ అస్వస్థత..
అయితే బొత్స సత్యనారాయణ తరచూ అస్వస్థతకు గురవుతూ వచ్చారు. గతంలో సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమంలో భాగంగా తూలి పడిపోయారు. అయితే ఇప్పుడు కూడా ఆయన రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈరోజు సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తూలి పడిపోయారు. పక్కకు పడిపోతున్న తరుణంలో సహచర ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. అనంతరం వైసిపి వర్గాలు అత్యవసరంగా వైద్యులను రప్పించారు. బొత్స సత్యనారాయణ చాంబర్ లోనే వైద్య పరీక్షలు చేశారు. బీపీలో హెచ్చు తగ్గులే ఆయన అనారోగ్యానికి కారణం అని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బొత్స ఇంటికి వెళ్లిపోయారు.

* హైదరాబాదులో చికిత్స..
ఇటీవల బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాదు( Hyderabad) ఆసుపత్రికి తరలించారు. అయితే తరచూ అనారోగ్యానికి గురికావడంతో క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరమవుతారని ప్రచారం నడిచింది. కుటుంబ సభ్యులు సైతం ఆయన స్ట్రెస్ కు గురవుతున్నారని చెప్పి.. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పించాలని జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వేళ ఉన్నఫలంగా బొత్స హాజరు కావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడినట్లు అంతా భావించారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా రేపు శాసనసభ సమావేశాలు చివరి రోజు. చూడాలి బొత్స సభకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular