Homeఆంధ్రప్రదేశ్‌Divvela Madhuri Tirumala Controversy: తిరుమలలో అదేం పని.. అడ్డంగా బుక్ చేసిన దివ్వెల మాధురి!

Divvela Madhuri Tirumala Controversy: తిరుమలలో అదేం పని.. అడ్డంగా బుక్ చేసిన దివ్వెల మాధురి!

Divvela Madhuri Tirumala Controversy: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) ఇప్పుడు సెలబ్రిటీ జంట అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. తరచూ ఏదో ఒక వార్తతో ఈ జంట హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తిరుమలలో దివ్వెల మాధురి చేసిన ఘనకార్యం పోలీస్ కేసు అయ్యేలా ఉంది. గతంలో ఆమె తిరుమలలో రీల్స్ చేస్తూ బుక్కయ్యారు. ఆమెపై నమోదైన కేసుతో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు కూడా తన స్నేహితురాలిని తెచ్చి.. చేయకూడని పని చేశారు. దీంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదయింది. ఆమె మాట విని వచ్చిన స్నేహితురాలిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆమె సైతం లబోదిపోమంటున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

* కొత్త వివాదాలు..
టీటీడీ ( Tirumala Tirupati Devasthanam)) చుట్టూ వివాదాలు చాలావన్నట్టు ఇప్పుడు తిరుమలలో కొందరు చేస్తున్న అతి విమర్శలకు గురిచేస్తోంది. నిన్ననే తమిళనాడుకు చెందిన ఓ జంట ఆలయ సమీపంలోనే రీల్స్ చేసింది. దీనికి తోడు యూట్యూబర్లు అతిగా ప్రవర్తిస్తున్నారు. అసలే వివాదాస్పద అంశాల చుట్టూ తిరుగుతోంది టీటీడీ వ్యవహారం. ఇటువంటి సమయంలో లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. మరోవైపు దివ్వెల మాధురి సైతం అదే మాదిరిగా ప్రవర్తించారు. టీటీడీ నిబంధనలను కాదని ఆమె పుట్టినరోజు వేడుకలను జరిపించి అడ్డంగా బుక్కయ్యారు.

* కేక్ కట్ చేయడం నిషేధం..
బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss house) తన సహచర పార్టిసిపెంట్ తనుజా ను తీసుకొని వచ్చారు దివ్వెల మాధురి. అక్కడే ఒక గెస్ట్ హౌస్ లో దిగారు. ఆమె పుట్టినరోజుకు సంబంధించి కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అయితే తిరుమలలో జన్మదిన కేక్ లు కట్ చేయడం నిషేధం. ఇది పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో పాలకవర్గం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటువంటిది ఏకంగా కేక్ కట్ చేయడమే కాదు సోషల్ మీడియాలో పెట్టడం పై టీటీడీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ప్రస్తుతం దివ్వెల మాధురి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది. అయితే తనుజా మాత్రం చాలా బాధపడుతున్నారు. తాను హైదరాబాదులో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భావించానని.. కానీ మాధురి బలవంతం చేయడంతో వచ్చానంటూ ఆమె చెబుతున్నారు. పుట్టినరోజు నాడు తనూజాను అడ్డంగా బుక్ చేశారు దివ్యల మాధురి

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular