AP Rains : మండే ఎండల్లో( high temperature) రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా చెబుతోంది. అయితే నెలాఖరు వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చింది.. గత కొద్ది రోజులుగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఈ తరుణంలో కాస్త వర్షం పడితే బాగున్ను అని నిట్టూరుస్తున్నారు. ఇటువంటి తరుణంలో వర్షం వార్త వారిని ఉపశమనం కలిగిస్తోంది.
Also Read : కేసీఆర్ మాట : పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదా?
* ఉపరితల ద్రోణితో
బంగాళాఖాతంలో( Bay of Bengal) ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఒడిస్సా నుంచి విదర్భ వరకు ఇది విస్తరించి ఉంది. చత్తీస్గడ్ పై సైతం ప్రభావం చూపుతోంది. దీంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం వల్లే నాలుగు రోజులపాటు ఏపీలో వర్షాలతో పాటు చల్లటి వాతావరణం నెలకొననుంది. ముఖ్యంగా రాయలసీమలో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు, ఉరుములతో కూడిన పిడుగులు పడతాయి. ఉత్తర కోస్తాలో మాత్రం తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలో సైతం వర్షాలు పడనున్నాయి.
* కొనసాగుతున్న ఎండలు
అయితే అదే స్థాయిలో ఏపీలో ( Andhra Pradesh)ఎండలు కొనసాగుతున్నాయి. మార్చి నెల మొదటి వారం నుంచి విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి. వడగల్పులు సైతం వీస్తున్నాయి. అయితే ద్రోణి ప్రభావంతో అంతటా ఆకాశం మేఘావృతం అయింది. మబ్బులు కాస్తున్నాయి. దీంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు మండలాల్లో వడగాల్పులు సైతం వీస్తున్నాయి. అయితే వర్ష సూచనతో పాటు భారీ ఈదురు గాలులు ఉంటాయని తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే జీడి మామిడి పక్వానికి వస్తోంది. ఈ తరుణంలో వర్షాలు తో పాటు ఈదురు గాలులు వీస్తే ప్రమాదం తప్పదని భావిస్తున్నారు.
Also Read : మండలి చైర్మన్’పై అవిశ్వాసం? ఏపీలో మరో సంచలనం