https://oktelugu.com/

KCR : కేసీఆర్ మాట : పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదా?

KCR: చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీశారు. అటు తరువాత చంద్రబాబు సైతం కేసీఆర్ ను దెబ్బతీయగలిగారు. అయితే గత కొంతకాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య ఎటువంటి వ్యక్తిగత విమర్శలు లేవు. అయితే తాజాగా పొలిటికల్ కామెంట్స్ చేశారు కేసీఆర్. చంద్రబాబు విషయంలో సంచలన ప్రకటన చేశారు.

Written By: , Updated On : March 22, 2025 / 06:22 PM IST
KCR-Chandrababu

KCR-Chandrababu

Follow us on

KCR  : చంద్రబాబుతో( Chandrababu ) కెసిఆర్( KCR) వైరం ఈనాటిది కాదు. 1995 టిడిపి సంక్షోభంలో చంద్రబాబు వైపు నిలబడ్డారు కేసీఆర్. కానీ ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కకపోయేసరికి చంద్రబాబును విభేదించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. సొంతంగా టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో పార్టీ 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ చంద్రబాబు పై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఆయనతో అదే విభేదాలు కొనసాగించారు. చంద్రబాబు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశారు. చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీశారు. అటు తరువాత చంద్రబాబు సైతం కేసీఆర్ ను దెబ్బతీయగలిగారు. అయితే గత కొంతకాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య ఎటువంటి వ్యక్తిగత విమర్శలు లేవు. అయితే తాజాగా పొలిటికల్ కామెంట్స్ చేశారు కేసీఆర్. చంద్రబాబు విషయంలో సంచలన ప్రకటన చేశారు.

Also Read : ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్.. ఈ విషయంలో ఏకమయ్యారు

* ఇద్దరిదీ అదే పరిస్థితి
2023 ఎన్నికల్లో తెలంగాణలో( Telangana) ఓడిపోయింది కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి. సార్వత్రిక ఎన్నికల్లో అయితే దారుణంగా దెబ్బతింది. కనీసం బోణీ కొట్టలేదు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అప్పటినుంచి సంక్లిష్ట పరిస్థితులను కెసిఆర్ ఎదుర్కొంటున్నారు. రాజకీయ అంశాల జోలికి పోలేదు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కెసిఆర్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సైతం కేసీఆర్ మాదిరిగా మారింది.

* ఒంటరిగా గెలిచేవారు కాదు
అయితే చంద్రబాబు( Chandrababu) గెలుపును కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా కెసిఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ పార్టీ నేత ఒకరు చేసిన పాదయాత్ర ముగింపులో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. గత పది సంవత్సరాలుగా తెలంగాణను కాపాడుకున్నామని.. మళ్లీ ఇప్పుడు తెలంగాణను దోపిడీ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి కట్టడం వల్లే చంద్రబాబు గెలిచారని.. కానీ తెలంగాణలో సొంతంగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. దీంతో ఇప్పుడు కెసిఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : స్టాలిన్ కు షాక్.. నరేంద్ర మోడీకి జగన్ లేఖ!