AP Legislative Council:
Legislative Council : ఆ ఎమ్మెల్సీలంతా రాజీనామా చేసి నెలలు గడుస్తున్నాయి. వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. శాసనమండలి చైర్మన్( assembly Council chairman) ఫార్మేట్ లో రాజీనామా చేసిన ఆమోదానికి నోచుకోలేదు. వ్యక్తిగతంగా లేఖలు రాసినా చైర్మన్ స్పందించడం లేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఏం జరిగినా వారి రాజీనామా మాత్రం ఆమోదించకూడదు అని చైర్మన్ భావిస్తున్నారు. మరి కొద్ది రోజులపాటు జాప్యం జరగాలని కోరుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం మరింత రాజకీయ ప్రకంపనలు రేపే అవకాశం కనిపిస్తోంది. శాసనమండలి చైర్మన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు కాగా.. పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీల్లో చేరడానికి సిద్ధపడుతున్నారు. దీంతో ఇక్కడ అసలు సిసలైన రాజకీయం జరుగుతోంది.
Also Read : సభకు వచ్చేందుకు సగం మందికి ఇష్టమే.. అడ్డుకుంటున్నది జగనే!
* మండలిలో వైసీపీకి బలం..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే శాసనమండలిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 38 మంది సభ్యులు ఉండేవారు. సాధారణంగా శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 58. ఈ లెక్కన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఉండేది. ఆ పార్టీకి చెందిన చైర్మన్ మోసేన్ రాజు కూడా ఉన్నారు. పైగా బొత్స లాంటి సీనియర్ నేతను శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా నియమించారు జగన్. అయితే ఈ పరిస్థితిని గమనించిన కూటమి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామా.
* చైర్మన్ పై అవిశ్వాసం..
గత ఆగస్టులోనే ముగ్గురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత( Sunita) , బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అక్కడ కు కొద్ది రోజులకు ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ సైతం గుడ్ బై చెప్పారు. తాజాగా మర్రి రాజశేఖర్ సైతం రాజీనామా చేసి చైర్మన్ కు పంపించారు. కానీ ఎంతవరకు ఒక్క ఎమ్మెల్సీ రాజీనామా కూడా ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఐదుగురు రాజీనామా చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పడిపోతుంది. టిడిపి కూటమి బలం పెంచుకుంటుంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మోసేన్ రాజు ద్వారా ఈ రాజీనామాలు ఆమోదానికి నోచుకోకుండా పావులు కదుపుతోంది. అయితే మండలి చైర్మన్ వ్యవహార శైలి పై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. మరోవైపు అవసరం అనుకుంటే మనవి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సైతం టిడిపి సిద్దపడుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే మున్ముందు మండలి రాజకీయం మంటలు రేపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : సోము వీర్రాజు సరే.. ఆ ఇద్దరి సంగతేంటి?