https://oktelugu.com/

KKR vs RCB: మరి కాసేపట్లో మ్యాచ్.. బస్సు మిస్సయిన రహానే..

KKR vs RCB :ఐపీఎల్ 18వ ఎడిషన్ మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభానికి ఎదురుచూస్తున్నారు. ప్రారంభ ఎడిషన్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) పోటీ పడుతున్నాయి.

Written By: , Updated On : March 22, 2025 / 06:36 PM IST
RCB VS KKR Match

RCB VS KKR Match

Follow us on

KKR vs RCB : గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఈ సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో ఆడుతోంది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్లో పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సీజన్ లో బెంగళూరు జట్టు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి.. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండుసార్లు పరస్పరం తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ లలో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఒక్క పరుగు, రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయాలను కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. కోల్ కతా జట్టుకు గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. గత సీజన్లో జట్టును విజేతగా నిలిపినప్పటికీ కోల్ కతా యాజమాన్యం అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో పంజాబ్ జట్టు యాజమాన్యం అతడిని భారీ ధరకు మెగా వేలంలో సొంతం చేసుకుంది. దీంతో ఈ సీజన్లో కోల్ కతా జట్టుకు కొత్త కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు.

Also Read : ఈసారి ఐపీఎల్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే

కెప్టెన్ బస్సు మిస్సయ్యాడు

కోల్ కతా జట్టు తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో కోల్ కతా జట్టు కొద్దిరోజులుగా ప్రాక్టీస్ చేస్తోంది. శుక్రవారం కూడా జోరుగా ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ అనంతరం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో రెడీ అయ్యారు. హోటల్ రూమ్ కు వెళుతుండగా జట్టు బస్సు ఒకసారిగా బయలుదేరింది. అయితే కెప్టెన్ రహానే మిస్ అయ్యాడు.. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో అతడికి సమాచారం అందించడంతో.. అతడు ఆదరా బాదరాగా బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని కొంతమంది తమ ఫోన్లలో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ” కోల్ కతా జట్టు బస్సు బయలుదేరింది. కాకపోతే కెప్టెన్ ఆ బస్సును అందుకునేందుకు పరుగు ప్రారంభించాడు. జట్టు సభ్యులు బస్సులో కూర్చున్నప్పటికీ.. రహానే ఎందువల్లో అందులో ఎక్కలేకపోయాడు. దీంతో జట్టు సిబ్బంది రహానేకు సమాచారం అందించారు. అతడు వెంటనే వేగంగా బయలుదేరాడు. చివరికి బస్సు ఎక్కాడు. బస్సును క్యాచ్ చేయడంలో రహానే డు ఆర్ డై అనే విధానాన్ని పాటించాడు. చివరికి బస్సును అందుకున్నాడు. ఐపీఎల్ లోనూ ఈసారి అతడు అదే జోరు కొనసాగిస్తాడేమో.. గత సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. ఈసారి కూడా విజేతగా నిలపడానికి.. తన నాయకత్వాన్ని గొప్పగా చాటుకోవడానికి రహానే తాపత్రయపడతాడేమోనని” కోల్ కతా అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ విన్నర్స్ వీరే..