https://oktelugu.com/

IPL 2025: భీకరమైన ఫామ్ లో ఉన్నారు..ఈ యువ ఆటగాళ్లు ఈసారి ఏం చేస్తారో..

IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ టోర్నీని ఐపిఎల్ నిర్వహణ కమిటీ ఘనంగా ప్రారంభించింది. ఇక అభిమానులు తమకు ఇష్టమైన జట్టును.. ఇష్టమైన ఆటగాళ్లను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

Written By: , Updated On : March 22, 2025 / 06:57 PM IST
IPL Young Stars

IPL Young Stars

Follow us on

IPL 2025 : ఈసారి జరిగే ఐపిఎల్ లో కొంతమంది యువ ఆటగాళ్లు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో వారు సాలిడ్ ఫామ్ లో ఉన్నారు. గత సీజన్లో వారు మెరుపులు మెరిపించారు. మరి ఈసారి వారు ఏం చేస్తారో చూడాలి. గత సీజన్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన యువ ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

యశస్వి జైస్వాల్, రాజస్థాన్ రాయల్స్

ఈ యువ ఆటగాడి వయసు 23 సంవత్సరాలు.. రాజస్థాన్ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడిని రాజస్థాన్ జట్టు యాజమాన్యం పదనికోట్లతో కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో నాలుగు మ్యాచ్లలో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో ఆరు మ్యాచ్ లలో 258 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 165.38 కొనసాగించాడు. గత ఐపీఎల్ లో 435 పరుగులు చేశాడు .. ఇతడిది ఎడమచేతి వాటం బ్యాటింగ్ . పేస్, స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. ఈసారి ఐపీఎల్లో కూడా గొప్పగా ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు. బట్లర్ లేదా వైభవ్ సూర్య వంశీతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

Also Read : ఈసారి ఐపీఎల్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే

తిలక్ వర్మ, ముంబై ఇండియన్స్

ఇతడి వయసు 22 సంవత్సరాలు.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇతడిని ఎనిమిది కోట్లతో ముంబై జట్టు కొనుగోలు చేసింది.. ఇటీవల కాలంలో కీలకవర్మ ఫామ్ అద్భుతంగా ఉంది. SMAT లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చల్లగా పోయాడు. 2024 – 25 సీజన్ కు గానూ 286 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 178.75 గా ఉంది. ఒకసారి 104* పరుగులు చేశాడు. ఇక అంతర్జాతీయ టి20 లలో ఐదు మ్యాచ్లు ఆడి 175 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 159.09 గా ఉంది. గత ఐపిఎల్ సీజన్లో 416 పరుగులు చేశాడు.. ఇతడు ఎడమ చేతివాటం ఆటగాడు. స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఆడుతాడు. మూడు లేదా నాలుగు స్థానంలో సూపర్ బ్యాటింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్లో కనుక ఆడితే జట్టుకు ప్రధానమైన బలంగా మారుతాడు.

సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్

ఇతడి వయసు 23 సంవత్సరాలు. టాప్ ఆర్డర్ బ్యాటర్ గా ఉన్నాడు. 8.5 కోట్లకు ఇతడిని గుజరాతి యాజమాన్యం కొనుగోలు చేసింది.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 8 మ్యాచ్లలో 342 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 142.50. గరిష్టంగా 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రంజి ట్రోఫీలో ఐదు మ్యాచ్లు ఆడి 587 పరుగులు చేశాడు. ఇతడి సగటు గత ఐపీఎల్ లో 527 పరుగులు చేశాడు. ఇతడు ఎడమచేతి వాటం ఆటగాడు. స్పిన్ బౌలింగ్ ను అద్భుతంగా ఆడతాడు. టి20కి సరిపేతిరిగా ఇతడు బ్యాటింగ్ చేస్తాడు. గిల్, బట్లర్ తర్వాత ఇతడికి అవకాశం లభిస్తే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగలడు.

అభిషేక్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్

ఇతడి వయసు 23 సంవత్సరాలు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. గడిని 14 కోట్లు పెట్టి హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకుంది. గత ఐపిఎల్ లో 484 పరుగులు చేశాడు. అతడు స్ట్రైక్ రేట్ 204.21. 42 సిక్స్ లు కొట్టి గత సీజన్లో దుమ్మురేపాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో ఏడు మ్యాచ్లు ఆడి 315 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 192.07. ఈ టోర్నీలో ఇతడు చేసిన హైయెస్ట్ పరుగులు 105*. టి20 లలో జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో 100 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇతడు ఎడమ చేతివాటం ఓపెనర్. సిక్సులు సులభంగా కొడతాడు. 2024 – 25 సీజన్లో ఏకంగా 68 సిక్స్ లు కొట్టాడు. స్పిన్ బౌలింగ్ అద్భుతంగా వేస్తాడు. ఇతడు హెడ్ తో హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదలు పెడతాడు. అత్యంత వేగంగా పరుగులు చేస్తాడు. బౌలింగ్ కూడా అదే స్థాయిలో వేస్తాడు. అవకాశం లభిస్తే పెద్ద ఆటగాడు అవుతాడు.

జూరెల్, రాజస్థాన్ రాయల్స్

ఈ ఆటగాడి వయసు 23 సంవత్సరాలు. వికెట్ కీపర్ గా రాజస్థాన్ రాయల్ జట్టుకు సేవలందిస్తున్నాడు. ఇతడిని 14 కోట్లతో రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో ఏడు మ్యాచ్లు వారి 237 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 148.12. గరిష్టంగా 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టి20లలో జింబాబ్వే జట్టుపై 50 పరుగులు చేశాడు. గత ఐపిఎల్ సీజన్లో 195 పరుగులు చేశాడు. ఇతడు కుడి చేతి వాటం ఆటగాడు. ఆటను అత్యంత వేగంగా ముగిస్తాడు. సంజు శాంసన్, హిట్ మేయర్ తర్వాత ఐదు లేదా ఆరవ స్థానంలో ఆడే అవకాశం. ఇతడు వేగంగా ఆడితే పరుగులు ఆదే స్థాయిలో వస్తాయి.

నితీష్ కుమార్ రెడ్డి, సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన ఈ ఆటగాడు.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 247 పరుగులు చేశాడు. 9 వికెట్లు పడగొట్టాడు. గత ఐపిఎల్ సీజన్లో 303 పరుగులు చేశాడు.

రియాన్ పరాగ్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు గత ఐపీఎల్లో 510 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 223 పరుగులు చేశాడు.

Also Read : ఐపీఎల్ లో ఇప్పటివరకు వీళ్ళే టాప్!