Site icon OkTelugu

Chiranjeevi And Rajasekhar: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

Chiranjeevi And Rajasekhar

Chiranjeevi And Rajasekhar

Chiranjeevi And Rajasekhar: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే ఒకరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మరొక హీరో సినిమా రిలీజ్ అవుతుంది. దానివల్ల ఇద్దరి సినిమాలు క్లాస్ అవుతాయి. ఏ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే ఆ సినిమా మాత్రమే సక్సెస్ ని సాధిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది ఇప్పుడు ఉంటూనే వస్తుంది. అది పర్సనల్ గా తీసుకుంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చిరంజీవి మెగాస్టార్ గా మారిన తర్వాత రాజశేఖర్ సైతం హీరోగా మారి పలు సినిమాలైతే చేశాడు. ఇక తను మెగాస్టార్ తో పోటీ పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు రాజశేఖర్ ఫ్లాప్ లను మూట గట్టుకుంటూ వచ్చాడు.

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

చిరంజీవి స్థాయిని తను అందుకోలేకపోతున్నాననే ఒక నిరుత్సాహంతో ఎప్పుడు చిరంజీవి మీద నెగెటివ్ కామెంట్లు చేస్తూ ఉండేవాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా తన మార్కెట్ పూర్తిగా కోల్పోయాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు పాత్రలను చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం తనకు అవకాశం వస్తే విలన్ గా చేస్తానని పలు సందర్భాల్లో ఆయన మాట్లాడాడు.

ఇక దానికి తగ్గట్టుగానే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రాజశేఖర్ కి గోటిల ఫ్యాక్టరీ ఉంది అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అయ్యాయి. మరి దాని మీద రీసెంట్ గా జీవిత సైతం స్పందించి అలాంటిదేమీ లేదని కావాలనే ఎవరో అలా క్రియేట్ చేశారు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక మొత్తానికైతే ఇప్పుడు రాజశేఖర్ నిజంగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట. ఫుడ్ బిజినెస్ ని ఆయన చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

దీనికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చి తన రెస్టారెంట్ ని ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి, రాజశేఖర్ లు ఈమధ్య తరచుగా కలుస్తూ మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్దేశ్యంతోనే చిరంజీవి సైతం రాజశేఖర్ చేసే ఫుడ్ బిజినెస్ ని ఓపెన్ చేయడానికి రాబోతున్నారట…

Exit mobile version