Homeఆంధ్రప్రదేశ్‌AP MLC Elections Counting: కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!

AP MLC Elections Counting: కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!

AP MLC Elections Counting: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు( MLC elections) సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. కృష్ణ- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు తక్కువ ఓట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇందులో తొలి రౌండ్ లో కూటమికి షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే కూటమి నేరుగా అభ్యర్థిని నిలపకపోయినా.. ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థి పిఆర్టియు కంటే వెనుకబడినట్లు తెలుస్తోంది.

Also Read: రాజధానిపై మారిన వైఎస్సార్ కాంగ్రెస్ స్టాండ్!

* ఏపీటీఎఫ్ కు కూటమి మద్దతు..
ఏపీటీఎఫ్( aptf ) తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ బరిలో ఉన్నారు. పిఆర్టియు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తున్నారు. యుటిఎఫ్ తరఫున విజయ గౌరీ బరిలో ఉన్నారు. త్రిముఖ పోటీలో నువ్వా నేనా అనే పరిస్థితి కొనసాగింది. అయితే ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. దీంతో ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని అంతా భావించారు. అయితే తొలి రౌండులో రఘువర్మ వెనుకబడ్డారు. ఎవరికి గెలిచేంత ఆధిక్యం రానప్పటికీ.. గాదె శ్రీనివాసుల నాయుడు మాత్రం తన సమీప ప్రత్యర్థి రఘువర్మ కంటే 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

* చెల్లని ఓట్లు అధికం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ( teachers MLC) ఎన్నికలకు సంబంధించి 20వేల 783 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 19813 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. తొలి రౌండు ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసుల నాయుడుకి 7210 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు 6,835 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ నిలిచారు. ఆమె 5810 ఓట్లు సొంతం చేసుకున్నారు. దీంతో ఫలితం రెండో రౌండ్ లోనే తేలనుంది. త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పడం సాధ్యం కావడం లేదు.

 

Also Read:  రాజకీయాలను మరిచిపోలేకపోతున్న విజయసాయిరెడ్డి!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular