YSR Congress Party : ఏపీలో రాజకీయాలు( politics) హాట్ హాట్ గా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులు జరగడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. దానిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి తరుణంలో అమరావతి రాజధాని అంశం మరోసారి చర్చకు వచ్చింది. అమరావతిలో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. దానిపై కూటమి పార్టీల నేతలు మాట్లాడుతూ విశాఖ రుషికొండలో పర్యాటకం పేరిట అవినీతికి పాల్పడ్డారు అంటూ శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించేసరికి ఈ అంశం బయటకు వచ్చింది. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని విషయంలో స్టాండ్ ఏమిటని ప్రశ్నించేసరికి ఆ పార్టీ నేత బొత్స సమాధానం చెప్పలేకపోయారు.
Also Read : జగన్ షాక్ అదుర్స్.. తేరుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు.. నిరాశలో టిడిపి కూటమి!
* అందరి ఆమోదంతో అమరావతి
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం( Telugu Desam) అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. అందరి ఆమోదంతో అమరావతిని ఎంపిక చేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేసి.. విశాఖను పాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దానిని ప్రజలు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడానికి రాజధాని అంశం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది.
* రిషికొండ భవనాలపై సీఎం ప్రకటన
శాసనసభలో సీఎం చంద్రబాబు( CM Chandrababu) విశాఖ రుషికొండ అవినీతిపై మాట్లాడే సరికి బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అమరావతి రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించేసరికి పార్టీలో చర్చించి చెబుతామని సమాధానం చెప్పారు. తాము అమరావతి రాజధాని లో అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే.. రిషికొండ భవనాలతో పోల్చడం సరికాదని అన్నారు బొత్స. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా టిడిపి కూటమి నేతలు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతోనే గత ఐదేళ్లుగా ఏపీకి రాజధాని అంటూ లేకుండా పోయిందని.. అమరావతిని కొనసాగించి ఉంటే ఈపాటికి రాజధాని అందుబాటులోకి వచ్చి ఉండేదని గుర్తు చేస్తున్నారు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు.
* పున సమీక్ష తప్పనిసరి
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ రాజధానుల విషయంలో పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు తిప్పికొట్టిన క్రమంలో.. అమరావతి ఏకైక రాజధానికి జై కొట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ మూడు రాజధానులు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మాత్రం అది కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కానుంది. అయితే రాజధాని స్టాండ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజుల పాటు మౌనం దాల్చే అవకాశాలు ఉన్నాయి. 2029 ఎన్నికలకు ముందే దీనిపై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అంతవరకు అమరావతి రాజధాని నిర్మాణాల్లో లోపాలను ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read : జగన్.. పవన్ సమ్మర్ యాక్షన్ ప్లాన్.. ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తారా?