VijayaSai Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. మొన్నటికి మొన్న పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇకనుంచి రాజకీయాల జోలికి వెళ్ళనని కూడా తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీ షర్మిలను కలిశారు. ఇంకోవైపు వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.
* ఉపరాష్ట్రపతిని కలిసిన విజయసాయిరెడ్డి
అయితే విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఇప్పుడు సడన్గా ఉపరాష్ట్రపతి ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక ఏం జరిగి ఉంటుందన్న అనుమానం కలుగుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బిజెపి హస్తము ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన రాజకీయాలకు దూరమైన తర్వాత ఉపరాష్ట్రపతిని కలవడం మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిన్ననే హైదరాబాద్ కు భారత ఉపరాష్ట్రపతి వచ్చారు. ఆయనను ప్రత్యేకంగా కలిశారు విజయసాయిరెడ్డి. ఆ సమయంలో టిడిపికి చెందిన ఎంపీ సాన సతీష్ అక్కడే ఉండడం విశేషం. తెర వెనుక రాజకీయాలు నడుస్తున్నాయని అనుమానాలు కలిగేలా ఈ పరిణామం చోటుచేసుకుంది.
Also Read : ఇలా రాజకీయాలు వదిలేశాడు అలా మోడర్న్ ఫార్మర్ అయ్యాడు.. షేక్ చేస్తున్న విజయ్ సాయి రెడ్డి పిక్స్
* బిజెపిలో చేరుతారని ప్రచారం
ఏ రాజకీయ పార్టీలో చేరనని విజయసాయిరెడ్డి ప్రకటించారు. కానీ ఆయన బిజెపిలోకి( BJP) వెళ్తారని బయట ప్రచారం నడుస్తోంది. తాను కాకపోయినా కుమార్తెను బిజెపిలోకి పంపిస్తారని కూడా టాప్ నడిచింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తెలంగాణకు ఉపరాష్ట్రపతి వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు ప్రతినిధులు హాజరయ్యారు. కానీ అక్కడకు విజయసాయిరెడ్డి రావడంతో రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తిరిగి విజయసాయిరెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే తాను మర్యాదపూర్వకంగా మాత్రమే ఉపరాష్ట్రపతిని కలిసానని.. అందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదని అనుచరుల వద్ద విజయ్ సాయి రెడ్డి చెప్పినట్లు సమాచారం
Also Read : జగన్.. పవన్ సమ్మర్ యాక్షన్ ప్లాన్.. ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తారా?