Homeఆంధ్రప్రదేశ్‌AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమాల ప్రభావంతో విద్యార్థులు రకరకాల హెయిర్ స్టైల్స్ తో పాఠశాలకు రావడం గమనించింది విద్యాశాఖ. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు […]

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమాల ప్రభావంతో విద్యార్థులు రకరకాల హెయిర్ స్టైల్స్ తో పాఠశాలకు రావడం గమనించింది విద్యాశాఖ. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు విద్యార్థులంతా సమానం అన్న భావన పెంపొందించడం కోసం.. సరికొత్తగా హెయిర్ కటింగ్ పై నిబంధనలు జారీచేసింది.

* సోషల్ మీడియా ప్రభావం..
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. సినిమాలతో పాటు క్రీడాకారుల ప్రభావం కూడా అధికం. చాలామంది పిల్లలు సినిమా హీరోలను అనుకరిస్తున్నారు. నచ్చిన క్రీడాకారుడు పేరుతో రకరకాలుగా హెయిర్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా రకరకాల రంగులు కూడా వేస్తూ స్పైక్స్, ముల్లెట్, ఫ్యాట్రాన్స్, ఎక్స్ డ్రీమ్ వంటి హెయిర్ స్టైల్ ను ఎంచుకుంటున్నారు. అయితే విద్యార్థులకు స్వేచ్ఛ పెరగడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. అందుకే దీనిని పరిష్కరించేందుకు ఏకరూప హెయిర్ స్టైల్ నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు.

* ఏక భావం కోసం..
ఒకే రకమైన హెయిర్ స్టైల్ తో పాఠశాలలకు రావడం వల్ల విద్యార్థుల్లో ఏక భావం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వర్తింప చేస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్, టీచర్స్ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కూడా ఆదేశించారు. ఈ చర్యల కారణంగా విద్యార్థుల్లో చదువుపై ఏకాగ్రత కుదురుతుందని.. అనవసరమైన పోటీ తగ్గుతుందని.. అందరూ సమానంగా చదువుకుంటారని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper