AP Elections 2024: పోలీస్ శాఖలో మార్పు దేనికి సంకేతం?

AP Elections 2024: ప్రభుత్వ పెద్ద సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులే ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. వారిపై బదిలీ వేట పడుతుండడంతో ప్రభుత్వం మారక తప్పదన్న సంకేతాలు ఇస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 27, 2024 2:55 pm

What is the sign of change in the police department

Follow us on

AP Elections 2024: ప్రభుత్వాలు మారితే పోలీసు బాసులు మారుతారు. డిజిపి నుంచి కిందిస్థాయి ఎస్సై వరకు తాము చెప్పు చేతల్లో ఉన్నవారే ఉండాలని అధికార పార్టీ భావిస్తుంది. అది సహజం కూడా. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర డిజిపి నుంచి డీఎస్పీ వరకు.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారే నియమితులు కావడం విశేషం. సిక్కోలు నుంచి అనంతపురం వరకు డీఎస్పీ పోస్టుల్లో సొంత సామాజిక వర్గాన్ని నియమించడం కూడా విమర్శలకు తావిచ్చింది. గత ఎన్నికలకు ముందు టిడిపి(TDP) ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఏకపక్షంగా పోస్టింగులు ఇచ్చినట్లు ఇదే వైసిపి(YCP) ఆరోపించింది. కానీ అది నిజం కాదని ఇదే ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. అయితే ఐదు సంవత్సరాల పాటు క్రిమినల్ మైండ్ లో కొనసాగిన పోలీస్ పాలన.. ఇప్పుడిప్పుడే మార్పు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ని(DGP Rajendranath Reddy) మార్చారు. పలు జిల్లాల ఐపీఎస్ లపై సైతం బదిలీ వేటు వేశారు. ప్రభుత్వ పెద్ద సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులే ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. వారిపై బదిలీ వేట పడుతుండడంతో ప్రభుత్వం మారక తప్పదన్న సంకేతాలు ఇస్తున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని సడన్ గా వీఆర్ కు పంపారు. ఆయన ఒక్కరినే కాదు. ఇంకా చాలామంది అదే వరుసలో ఉన్నారు. వివాదాస్పద అధికారులను, అస్మదీయులను పెద్ద ఎత్తున నియమించారు. అర్హులను పక్కనపెట్టి, తమ చెప్పు చేతల్లో ఉన్న పోలీస్ అధికారులను వైసిపి ప్రజాప్రతినిధులు తెప్పించుకున్నారు. అయితే ఈ పోలీస్ వ్యవస్థను జగన్ తో పాటు వైసిపి ఎంత వాడుకోవాలో అంతలా వాడుకుంది. ఇప్పుడు దానికి పోలీస్ శాఖ మూల్యం చెల్లిస్తోంది. రాష్ట్ర డిజిపి నుంచి కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు బదిలీ వేట్లు, వి ఆర్ లకు పంపించడం కొనసాగుతోంది.

రాష్ట్ర డిజిపిగా రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపిక ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఆయనను అడ్డగోలుగా నియమించారన్న విమర్శ బలంగా వినిపించింది. ముందుగా ఇన్చార్జిగా తెరపైకి తెస్తూ.. తర్వాత రెండేళ్ల పాటు ఆయనను కొనసాగించారు. సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాలో.. ఎక్కడో 11వ పేరుగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి ని తెచ్చి డిజిపి పీఠంపై కూర్చోబెట్టారు. గత మూడు సంవత్సరాలుగా రాజేంద్రనాథ్ రెడ్డి సేవలు వైసీపీకి చక్కగానే అందాయి. కానీ ఎన్నికల ముంగిట ఆయన వేటు తప్పించుకోలేకపోయారు. చాలా జిల్లాల ఎస్పీలు సైతం పక్కకు వెళ్లిపోయారు. ఎలక్షన్ కమిషన్ కలుగజేసుకుని పక్కకు తప్పించింది. ఇప్పుడు అంతర్గతంగా అధికార పార్టీకి సహకరించి, వారి అడుగులకు మడుగులొత్తిన పోలీస్ అధికారులను మార్చే పనిలో పడింది పోలీస్ శాఖ.

ఏపీలో ప్రభుత్వం మారుతుందన్న స్పష్టమైన సంకేతాలతోనే.. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా ఈ స్థాయిలో పాలన సాగిందో పోలీస్ అధికారులు కూడా తెలుసు. కానీ ఏ మాత్రం దృష్టి పెడితే ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే గత ఐదు సంవత్సరాలుగా చూసి చూడనట్లుగా వెళ్లారు. కానీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని సంకేతాలు ఉన్నాయి. అటు నిఘా వర్గాలు దీనినే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే పోలీస్ శాఖలో చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించినట్లు సమాచారం. మొత్తానికి అయితే పోలీస్ శాఖలో.. ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులపై వరుస వేటులు పడుతుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం మారుతుందన్న స్పష్టమైన సంకేతం కనిపిస్తోంది.

AP Elections 2024: ఏపీలో సేమ్ సీన్.. నాడు టిడిపి, నేడు వైసిపి

Venkataramana Reddy: సాక్షి పేపర్లో ఆ ఒక్కటే నిజమైన వార్త ఆట.. ఒప్పుకున్న ఆంధ్రజ్యోతి..