Site icon OkTelugu

Tecno Pova Curve: సూపర్ బ్యాటరీ.. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ ఫోన్ గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

Tecno Pova Curve

Tecno Pova Curve

Tecno Pova Curve: నేటి కాలంలో మొబైల్ కొనేవారు బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. రోజువారి అవసరాలతో పాటు కార్యాలయ అవసరాలకు మొబైల్ బ్యాటరీ చాలావరకు ఉపయోగపడే అవకాశం ఉంది. వీరికి అనుగుణంగా Techno Pova Curve 2 మొబైల్ నేటి తరం వారికి ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా ఇందులోని బ్యాటరీ పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని అనుకోవచ్చు. అలాగే చూడగానే ఆకట్టుకునే విధంగా కర్వ్ డిజైన్ ఉండడంతో స్టైలిష్ గా కనిపిస్తుంది. వేగంగా చార్జింగ్ అయ్యే విధంగా ఈ బ్యాటరీ ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

2025 ఏడాదిలో టెక్నో పోవా కర్వ్ మొబైల్ కంటే కర్వ్ 2 డిజైన్ స్టైలిష్ గా ఉంది. ఇది 0. 08mm మాత్రమే ఉండడంతో పాటు వంపులు తిరిగిన అంచులతో అందంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్ కూడా చూడ్డానికి ప్రీమియం లుక్ ల అనిపిస్తుంది. మ్యాట్ ఫినిషింగ్ ఉన్నప్పటికీ ఇలాంటి వేలిముద్రలు పడినా.. నీటి చుక్కలు పడినా.. వెంటనే తొలగిపోయే విధంగా ప్యానెల్ను అమర్చారు. ఈ మొబైల్ డిస్ప్లే 6.78 అంగుళాల AMOLED తో కలిగి ఉంది. ఈ డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ 7i ఉండడంతో ప్రత్యేకంగా రక్షణ ఉంటుంది. అలాగే ఎలాంటి కాంతి లోనైనా వీడియోలు అద్భుతంగా చూసే విధంగా 1.5 కే resolution తో బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 16 వెర్షన్ సాఫ్ట్వేర్ ను కలిగిన ఇందులో Ai థీమ్ తో కలిగిన సాఫ్ట్వేర్ను పొందవచ్చు. అలాగే ఇందులో 7100 dimencity తో పాటు 8gb రామ్, 128 నుంచి 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫైల్స్ ను స్టోరేజ్ చేసుకోవచ్చు. కెమెరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న వారికి ఈ మొబైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇందులో 50 MP మెయిన్ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 13 ఎంపీ కెమెరా ఉండనుంది. దీంతో నాణ్యమైన ఫోటోలతో పాటు సెల్ఫీ ఫోటోలను కూడా హై రిజల్యూషన్ తో స్నాప్ చేసుకోవచ్చు. ఇలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన ఫోటోలు దీని ద్వారా పొందవచ్చు. ఈ మొబైల్లో ఇప్పటివరకు వచ్చిన వాటికంటే కొత్తగా 8000 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 45 W వైర్డ్ చార్జింగ్తో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 20 గంటల 12 నిమిషాల వరకు అందిస్తుంది.

Exit mobile version