Rajamouli: దర్శకుడు రాజమౌళిని ఓ స్టార్ రైటర్ తిట్టారట. వేషాలు వేయకని మండిపడ్డారట. ఆ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి గుర్తు చేసుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ… మా పేర్లు అన్ని పెదనాన్నే పెట్టారు. మరకతమని కీరవాణి(Marakathamani Keeravani), శ్రీశైలం శ్రీ రాజమౌళి, ఇలా విభిన్నంగా మా పేర్లు ఉంటాయి. నా కూతురుకి కూడా ఇలాంటి పేరే పెట్టాలని అనుకున్నాను. కానీ దొరకలేదు. అందుకే సిరివెన్నెల చిత్రంలోని ‘విధాత తలపున’ సాంగ్ లోని మయూఖ(Mayookha) అనే పదం తీసుకుని పేరు పెట్టాను.
అందరి దర్శకుల్లాగే నా పనిని మెంచుకుంటే ఆనందం వేస్తుంది. నన్ను పొగిడినా అంత సంతోషం రాదు నా పనిని పొగిడితే సంతోషం కలుగుతుంది. పద్మశ్రీ అవార్డు(Padma Shri Award) వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళ్ళ కూడదు అనుకున్నాను. ఈ విషయాన్ని ఎవరినీ నొప్పించకుండా ఎలా చెప్పాలనే ఆలోచనలో ఉన్నాను. సీతారామ శాస్త్రిగారు(Sirivennela Seetharama Sastry) ఫోన్ చేస్తే… పద్మశ్రీ అవార్డు తీసుకోవడం లేలదని చెప్పాను. మొదటిసారి ఆయన నా మీద కోప్పడ్డారు. వేషాలు వేస్తున్నావా? నోరుమూసుకుని వెళ్ళు అని తిట్టారు.
నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని ప్రభుత్వం ఇస్తుంటే తీసుకోను అంటావా.. అని అన్నారు. ఆయన చెప్పారని వెళ్లి పద్మశ్రీ అందుకున్నాను. శాస్త్రి గారితో రొమాంటిక్ సాంగ్స్ రాయించాలంటే నాకు భయం. ఆయన పాట రాస్తుంటే నేను నిద్రపోయేవాడిని. పెద్దగా అరిచి నిద్రలేపేవారు. మర్యాద రామన్న చిత్రంలో ‘పరుగులు తీయ్’ అనే సాంగ్ ఆయనే రాశారు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ యూట్యూబ్ లో వింటూ ఉంటాను. నా ప్రతి సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసేవారు.
సినిమాలో బాగున్నవి బాగోలేని సన్నివేశాల గురించి చర్చించేవారు. ఆయన సలహాలు నా మదిలో కొన్ని రోజుల పాటు మెదిలేవి. శాస్త్రి గారు నా గురువు. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన కృషి అనిర్వచనీయం. చాలా మందికి శాస్త్రి స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితాల్లో ముందుకు సాగేందుకు బాటలు వేశారు, అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో రాజమౌళికి ఇంతటి అనుబంధం ఉందా? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా నెక్స్ట్ రాజమౌళి హీరో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు.
Mahesh-Rajamouli: మహేష్-రాజమౌళి చిత్ర నిర్మాత కీలక ప్రకటన… అవన్నీ పుకార్లే అట!
NTR – Rajamouli : ఎన్టీఆర్ రాజమౌళి కాంబో లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందా..?