Site icon OkTelugu

Mahesh Babu And Vijay: మహేష్ బాబు చెప్పినట్టుగానే తలపతి విజయ్ లైఫ్ లో జరుగుతుందా..? వైరల్ వీడియో…

Mahesh Babu And Vijay

Mahesh Babu And Vijay

Mahesh Babu And Vijay: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు స్టార్ హీరోలుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది హీరోలు మాత్రమే టాప్ లెవల్ కి వెళ్తున్నారు. ఒక్క భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలనే తాపత్రయంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తలపతి విజయ్ మాత్రం రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ని సాధించాడు. అదే రేంజ్ లో క్రేజ్ ను కూడా మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన టీవీకే అనే రాజకీయ పార్టీని పెట్టి తమిళనాడు రాజకీయరంగంలోకి అడుగు పెట్టాడు. ఇక ఇదే క్రమంలో విజయ్ భార్య అయిన సంగీత తన భర్త అయిన విజయ్ కొన్ని సంవత్సరాల నుంచి వేరే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని దానివల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కింది…

దీనిమీద విజయ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. ఇక ఆమె వాదనలో నిజం ఉంది అని కొంతమంది చెబుతుంటే మరి కొంతమంది మాత్రం రాజకీయ రంగంలోకి విజయ్ అడుగు పెట్టాడు కాబట్టి కావాలనే కొంతమంది ఆమె చేత ఇలాంటి కేసులను వేయిస్తున్నారు అంటూ వాపోతున్నారు. ఇక రాజకీయ రంగంలో చాలా చాకచక్యంగా ఉండాలి.

ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా అధికార పార్టీ వాళ్లు తొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక రాజకీయ రంగం ఎలా ఉంటుంది అనే విషయంలో కొత్తగా రాజకీయ పార్టీని పెట్టిన వాళ్లను సైతం ఎలా తొక్కేయాలి అనే విషయంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బిజినెస్ మేన్’ సినిమాలో మహేష్ బాబు చాలా క్లారిటిగా చెప్పాడు.

మహేష్ బాబు అక్కడ ఏదైతే చెప్పాడో ఇప్పుడు విజయ్ జీవితంలో అదే జరుగుతుంది అంటూ కొన్ని ఆరోపణలైతే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం విశేషం… ఇక విజయ్ తన భార్య చేసిన ఆరోపణల మీద ఎలా స్పందిస్తాడు హీరోయిన్ తో ఎఫైర్ ఉందా లేదా అనే విషయం మీద క్లారిటీ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version